మంచి ఫలితాలను చూపుతున్న లాక్‌డౌన్ – పెరుగుదల నిష్పత్తిలో చాలా మార్పులు…?

Friday, March 27th, 2020, 08:25:02 AM IST

గతకొద్ది రోజులుగా భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ భారత్ లో భయంకరంగా పెరుగుతున్న కారణంగా దేశ ప్రజలందరి మంచి కోరి మన దేశ ప్రధాని దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ దేశంలో చక్కటి ఫలితాలను చూపిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అధికారికంగా ప్రకటించారు. అయితే లాక్‌డౌన్ క్రమంలో ప్రజలందరూ కూడా సామాజిక దూరం పాటించడం వలన రోగుల సంఖ్య తగ్గకపోయినప్పటికీ కూడా ఈ కరోనా వైరస్ పెరుగుదల నిష్పత్తి మాత్రం చాలా వరకు తగ్గిందని వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు.

అయినప్పటికీ కూడా మనం ఇలాగే మరికొద్ది రోజులు సామాజిక దూరాన్ని పాటించడం వలన ఈ కరోనా వైరస్ ని పూర్తిగా నివారించవచ్చని, ప్రజలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వచ్చిన అధికారిక లెక్కల ప్రకారం మన దేశంలో ఈ భయంకరమైన కరోనా వైరస్ వలన ఇప్పటి వరకు దాదాపుగా 16 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపుగా 694 మంది కరోనా వైరస్తో బాధపడుతున్నారు. ఇకపోతే ఈ వైరస్ కి సంబందించిన కేసులు మాత్రం పెరగడం గమనార్హం…