బిగ్ న్యూస్: తెలంగాణలోకి ప్రవేశించిన మిడతల దండు..!

Friday, May 29th, 2020, 01:37:23 AM IST

ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అవుతున్న దేశ ప్రజనీకాన్ని తాజాగా మిడతల దండు కూడా మరింత భయపెడుతుంది. అయితే నేడు మిడతల దండుపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ మిడతల దండు రాష్ట్రంలోకి రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు ఫైర్ ఇంజన్లు, జెట్టింగ్ మిషన్లు, పెస్టిసైడ్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. అంతేకాదు ఈ చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని కూడా నియమించినట్టు ప్రకటించారు.

అయితే ఉత్తరాదిలో పంటలను నాశనం చేసిన మిడతల దండు తెలంగాణలోకి ప్రవేశించింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రాణహిత, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అయితే రైతులు అప్రమత్తంగా ఉండాలని, మిడతలు పంటపొలాల్లోకి వస్తే తమకు తెలియజేయాలని అధికారులు సూచించారు.