మంత్రి ని డిస్మిస్ చెయ్యబోతున్న లోకేష్ బాబు ?

Friday, January 27th, 2017, 12:49:19 PM IST

lokesh
సెక్యూరిటీ ని పక్కన పెట్టి రెండు గంటల పాటు ఎవ్వరికీ కనపడని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావేల కిషోర్ బాబు వ్యవహారం ఇప్పుడు క్యాబినెట్ సమావేశం తో పాటు ముఖ్యమంత్రి దగ్గర కూడా సీరియస్ అయ్యింది. రావెల చేసిన పనికి సీరియస్ గా ఉన్న నాయకత్వం ఆయన్ని తప్పించేలా ఉన్నారు అంటున్నారు. లోకేష్ కి కూడా తానే గాడ్ ఫాథర్ అని చెప్పుకునే రావెల ని స్వయంగా లోకేష్ తప్పించే ప్లాన్ చేస్తున్నాడట.మార్పు చేర్పులు ఎప్పుడు జరిగినా తొలి వేటు ఆయనపైనేనని ఈ విషయంలో ఆయన కులం కార్డు కూడా అక్కరకురాదని పార్టీ నేతలు అంటున్నారు. పార్టీ లో రావెల తీవ్ర వివాదంగా మారారు . ఆయన పనితీరు మీద ఆయాన జిల్లా నుంచే కాక నియోజికవర్గం నుంచి కూడా అనేక విమర్శలు ఉన్నాయి.అయినా నాయకత్వం ఆయన్ని భరిస్తూ వచ్చింది.ఒక క్యాబినెట్ మంత్రి సెక్యూరిటీని కూడా పక్కకుపెట్టి మాయం కావలసిన పనేమిటన్న విమర్శలు మొదలయ్యాయి. ప్రధానంగా సోషల్ మీడియాలో రావెల మాయంపై అనేక అనుమానాలతో కూడిన కామెంట్లు రావడం నాయకత్వానికి ఇబ్బందిగా పరిణమించింది.