శ్వేతపత్రంపై స్పందించిన లోకేష్ – ఎక్కడ తగ్గట్లేదుగా…?

Wednesday, July 10th, 2019, 11:40:40 PM IST

ఏపీలో జరగనున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేడు విడుదల చేసినటువంటి శ్వేతపత్రంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా సాక్షి కథనాల లాగే ప్రభుత్వ శ్వేత పత్రం కూడా స్పష్టత, ఆధారం లేకుండా ఉంటుందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ట్విట్టర్ ద్వారా లోకేష్ ప్రశ్నలవర్షం కురిపించారు. 2018-19 బడ్జెట్ ప్రకారం రాష్ట్ర అప్పు రూ.2లక్షల 49వేల కోట్లు అని, కేంద్ర ఆర్థికమంత్రి కూడా గత వారం పార్లమెంటులో ఇదే విషయాన్ని చెప్పారు. కానీ నేడు విడుదల చేసిన పత్రంలో 3 లక్షల 62 కోట్లు అని ఎలా పేర్కొణ్టరు అని లోకేష్ ప్రశ్నించారు. మీరు అధికారంలోకి వచ్చాక ఏమైనా అప్పులు చేశారా అని లోకేష్ విమర్శలు చేశారు. అప్పు ఎక్కువ చూపించి మీరేం చెప్పదలచుకున్నారు? రాష్ట్ర పరిస్థితి తెలియకుండానే మీరు అన్ని హామీలు చేశారా? వాటిని నెరవేర్చకుండా తప్పించుకోడానికి ఇప్పుడు అప్పుల బూచిని బూతద్దంలో చూపిస్తే కుదరదు. చాతకాదంటే ప్రజల ముందు ఒప్పుకోండి. అంతేకాకుండా మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖల అభివృద్ధిని వ్యవసాయశాఖ అభివృద్ధిలో ఎలా చూపిస్తారని అడిగారు. ముందుగా ఆ శాఖల అభివృద్ధిని మీరు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. అయితే వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖలను కలిపే జీఎస్ డిపిని లెక్కించడం దేశమంతా ఉంది. మీకది కొత్త విషయం అంతే అని లోకేష్ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. .