లోకేష్ కి కూడా ఈ బాధలు తప్పడంలేదు కదా…

Saturday, August 24th, 2019, 02:14:37 AM IST

గత కొద్దీ రోజులనుండి రాజకీయ నాయకులకు సంబంధించి సామజిక మాంద్యమాల్లో పొలిటికల్ వార్స్ పెరిగిపోయాయి. వారికి అవకాశం రాగానే తమ ప్రత్యర్థులను ట్వీట్లతో, అనవసరమైన మాటలతో రెచ్చగొడుతూ, అవతలి వారికి ఒకరకమైన భయాందోళనకు గురి చేస్తున్నారు సదరు నేతలు… అయితే ఇదంతా ఒక ఎత్తు… కానీ కొందరికి మాత్రం తమ సొంత పార్టీ నేతలనుండే ఈ మధ్యకాలంలో ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి… కాగా సామజిక మాంద్యమాల్లో ఎప్పటికి ఆక్టివ్ గా ఉండే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ఇటీవల సాహూ సినిమా విషయంలో స్పందించిన తీరు టీడీపీ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అయితే సదరు టీడీపీ అభిమానులందరూ, కొందరు కార్యకర్తలు కూడా లోకేష్ పై అదే ట్విట్టర్ ద్వారా ట్రోలింగ్ చేస్తూ తమ ఆగ్రహాన్ని లోకేష్ కి పరిచయం చేస్తున్నారు.

సాహూ సినిమా విషయంలో నారా లోకేష్ స్పందించిన తీరుకి ఆగ్రహించిన టీడీపీ అభిమానులు… లోకేష్, బాలకృష్ణ రాజకియాలకు అనర్హులని, వారిద్దరూ పార్టీకి దూరంగా ఉంటే మంచిదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అయితే గతంలో బీజేపీ నేత, నటుడు కృష్ణం రాజు ఒక సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబుని చచ్చిన పాము అని కామెంట్ చేశారని, తాజాగా ప్రభాస్, జగన్ ని పొగుడుతూ మాట్లాడారని తెలిసికూడా,మన గురించి తప్పుగా మాట్లాడిన వారికి మద్దతు ఎలా ఇస్తారని సొంత పార్టీ నుండే తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు లోకేష్. ప్రస్తుతానికి ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.