సీఎం భ‌ర‌త్‌కి లోక్‌స‌త్తా ఆద‌ర్శాలే స్ఫూర్తి?

Sunday, April 29th, 2018, 09:09:54 PM IST

సీఎం భ‌ర‌త్ ఆశ‌యాల‌కు స్ఫూర్తి ఎక్క‌డినుంచి వ‌చ్చింది? ఇన్నాళ్లు ఈ కోణంలో ఎవ‌రూ ఆలోచించ‌నే లేదు. కొర‌టాల మైండ్ బ్లోయింగ్‌గా స్క్రిప్టు, డైలాగులు రాసుకున్నాడ‌ని ప్ర‌శంసించామే కానీ, అస‌లు అందులోని ఐడియాల‌జీ ఎక్క‌డి నుంచి తీసుకున్నారు? అన్న‌దానిపై ఎవ‌రూ దృష్టి సారించ‌లేదు. స‌రిగ్గా ఆలోచిస్తే ఈ సినిమాలో చూపించిన ఆ రెండు పాయింట్లు క‌చ్ఛితంగా లోక్‌స‌త్తా పార్టీ పాల‌సీలో నుంచి తీసుకున్న‌వే. అప్ప‌ట్లో తాము అధికారంలోకి వ‌స్తే .. లోక్‌స‌త్తా గెలిస్తే సీఎం అయిన వెంట‌నే స్థానిక సంస్థ‌ల‌కు అధికారం బ‌దలాయిస్తామ‌ని జేపీ ప్ర‌క‌టించారు. లోక‌ల్ గ‌వ‌ర్నెన్స్‌ను ఆయ‌న ప్రోత్స‌హించారు. అలానే చ‌ట్టం, న్యాయం సామాన్యుల‌కు- మాన్యుల‌కు స‌మానంగా ఉండాల‌ని అన్నారు జేపీ.

ఆ రెండిటిని స‌మ‌ర్థంగా ఉప‌యోగించి కొర‌టాల నేడు సినిమా తీసి 160 కోట్లు కుమ్ముకున్నాడు. `భ‌ర‌త్ అనే నేను` సినిమాతో కొర‌టాల సంపాదించినంతైనా జేపీ రాజ‌కీయాల్లో సంపాదించ‌లేక‌పోయాడు. ఈ విధ్యాధికుడిని ప్ర‌జ‌లే ప్ర‌త్య‌క్షంగా ఓడించి తాము కూడా ఈ దొంగ‌నాట‌కంలో ఓడారు. ఈరోజు హైద‌రాబాద్ ప్ర‌సాద్ లాబ్స్‌లో సినిమా చూసిన అనంత‌రం జేపీ ట్విట్ట‌ర్‌లో సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించారు. “ఫ్యామిలీ, స‌హోద్యోగులు, ఎంద‌రో ఫ్రెండ్స్‌తో క‌లిసి హైద‌రాబాద్‌- ప్ర‌సాద్ లాబ్స్‌లో సినిమా చూశాను. రెండు బ‌ల‌మైన సందేశాల్ని కొర‌టాల తెర‌పై ఆవిష్క‌రించారు. చ‌క్క‌ని మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని తెర‌కెక్కించారు. లోక‌ల్ గ‌వ‌ర్న‌మెంట్‌, రూల్ ఆఫ్ లా .. వంటి కీల‌క విష‌యాల‌పై అద్భుతంగా చూపించారు. అధికారం స్థానిక సంస్థ‌ల‌కే ధారాద‌త్తం చేస్తేనే ప్ర‌జాస్వామ్యం వ‌ర్ధిల్లుతుంది. ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రుగుతుంది“ అని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments