రామ్ వెళ్ళిపోతే అంతకన్నా మంచి నటుడు నాకు దొరికాడు – గౌతమ్ మీనన్

Tuesday, November 15th, 2016, 03:53:21 PM IST

goutham-menon
సౌత్ ఇండియాలోని టాప్ దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకరు. ఈయనతో ఒక్క సినిమా అయినా చేయాలని ఎందరో స్టార్ హీరో, హీరోయిన్లు ఎదురుచూస్తుంటారు. అలాంటిది మన యంగ్ హీరో రామ్ మాత్రం ఆ అవకాశాన్ని చేతులారా వదులుకున్నాడట. వివరాల్లోకి వెళితే ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో గౌతమ్ మీనన్ ఈ విషయాన్నీ స్వయంగా తెలిపారు. 2012 లో ఈయన డైరెక్ట్ చేసిన ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’ చిత్రంలో హీరోగా చేసింది నాని కానీ ముందుగా అందులో హీరో ఛాన్స్ రామ్ కు దక్కిందట.

ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కి ఒక ఐదు రోజులషూటింగ్ కూడా జరిగాక రామ్ ఏవో కారణాల వలన ఆ సినిమాలో నటించలేనని గౌతమ్ మీనన్ కు చెప్పి వెళ్లిపోయాడట. దాంతో గౌతమ్ మీనన్ నానిని ఆ సినిమా కంప్లీట్ చేశాడట. ఈ విషయాన్నీ చెప్తూ రామ్ వెళ్ళిపోతే అంతకన్నా మంచి నటుడు నాకు దొరికాడు. ఏ చెడు జరిగినా డి మన మంచి కోసమే అనుకోవాలి అన్నారు. 2012 డిసెంబర్ నెలలో రిలీజైన ఈ చిత్రం మంచి క్లాసిక్ చిత్రంగా పేరు తెచ్చుకుని నటుడిగా నాని కెరీర్ కు బాగా ఉపయోగపడింది. ఒకవేళ రామ్ ఈ సినిమా చేసుంటే అతని కెరీర్ కూడా అప్పుడే మంచి మలుపు తిరిగుండేదన్నది వాస్తవం.