ప్రేమ ఓకే, మరి పెళ్ళెప్పుడు నయన్?

Wednesday, March 7th, 2018, 05:45:46 PM IST

ప్రముఖ నటి నయనతార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివం కు మధ్య ప్రేమాయణం జరుగుతుందని, వారిద్దరూ చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని అప్పట్లో చాలానే పుకార్లు వచ్చాయి. అయితే ఒకప్పుడు డాన్సర్, నటుడు అయినా ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించిన నయన్ ఆ తరువాత కొన్ని కారణాలవల్ల ఆయనతో కలిసి ఉండలేనని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పలు దేశాలు చుట్టేస్తున్న ఈ జంట, మొన్న అమెరికా వెళ్లారు. తన ప్రియుడు విఘ్నేష్ పుట్టినరోజును ప్రత్యేకంగా లాస్ ఏంజెల్స్ లో తన సొంత ఖర్చుతో సెలబ్రేట్ చేసిందట నయన్.

ఆ పుట్టినరోజును వాళ్లిద్దరే ఎక్స్ క్లూజివ్ గా జరుపుకున్నారు. మళ్లీ షార్ట్ గ్యాప్ లో మరోసారి అమెరికా చుట్టొచ్చింది ఈ హాట్ జంట. ఈసారి కూడా వీళ్లిద్దరే వెళ్లారు. నాలుగురోజుల పాటు సరదాగా అలా గడిపి వచ్చిన ఈ జంట, తమ మధ్య ఉన్న బంధాన్ని వీళ్లు సీక్రెట్ గా ఉంచి లేనిపోని ఊహాగానాలకు తావివ్వడం ఇష్టం లేక సోషల్ మీడియా వేదికగా తమ అనుబంధాన్ని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంది.

అయితే ఆ అమెరికా ట్రిప్ ఫోటోలను విగ్నేష్ సోషల్ మిడియా లో పోస్ట్ చేశారు. మాకు అమెరికా లోచాలా చక్కటి అనుభవాలు దక్కాయి, ప్రామిస్ మరోసారి కచ్చితంగా వస్తాం. బై, బై అమెరిక అంటూ ఒక ట్వీట్ కూడా చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారనేది తేటతెల్లం అయింది. కాకపోతే ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే విషయంపై మాత్రం వీళ్లలో ఎవరూ క్లారిటీ ఇవ్వట్లేదు. అయితే ఈ విషయమై ఇప్పటివరకు అధికారికంగా నయనతార స్పందించని విషయం తెలిసిందే.

కాగా ఆ మధ్య గ్యాంగ్ మూవీ ప్రమోషన్ లో విఘ్నేష్ ను మీడియా మీకు నయన్ కు మధ్య వున్నా రిలేషన్ షిప్ గురించి చెప్పమంటే, ప్రస్తుతానికి ఈ విషయమై తను స్పందించనని కావాలంటే నయన్ నే అడగమని చెప్పడం జరిగింది….