లిరికల్ వీడియో : వచ్చాడయ్యో సామి (భరత్ అనే నేను)

Thursday, April 5th, 2018, 05:26:48 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సూపర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న నూతన చిత్రం భరత్ అనే నేను. కైరా అద్వానీ కథానాయిక. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలయిన ఈ చిత్రంలోని ఫస్ట్ ఓత్, విజన్ ఆఫ్ భరత్ యూట్యూబ్ లో సంచలనాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. అలానే ఇటీవల విడుదలయిన రెండు పాటలు యూట్యూబ్ లో దుమ్ము లేపుతున్నాయి. మహేష్ బాబు ముఖ్యమంత్రి గా నటిస్తున్న ఈ సినిమాలోని మూడవ పాటని యూనిట్ నేడు విడుదల చేసింది. ‘వచ్చాడయ్యో సామి’ అనే పల్లవితో సాగే ఈ పాట వినడానికి చాలా బాగుందని చెప్పాలి. దేవిశ్రీ మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి పదాలు పాటను మరొక మెట్టు ఎక్కించాయి. మరి ఆ అద్భుతమైన పాటని మీరు కూడా కింద ఇచ్చిన లింక్ ద్వారా వినేయండి…..