ట్వీట్ చేసి సెగలు రేపిన శశికళ సన్నిహితుడు..!!

Saturday, February 11th, 2017, 02:05:55 PM IST


ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న శశికళను ఊహించని షాక్ తగిలింది. పన్నీర్ సెల్వంకు ప్రజల్లో మద్దత్తు పెరుగుతున్న తరుణంలో నేతలు కూడా ఒక్కొక్కరుగా పన్నీర్ వర్గం వైపు జారుకుంటున్నారు. శశికళకు అత్యంత విధేయుడిగా ఉన్న మంత్రి పాండ్యరాజన్ పన్నీర్ సెల్వం మద్దత్తు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ప్రజలందరి అభిప్రయాల్ని గౌరవించాలని, అన్నా డీఎంకే ని కాపాడేందుకు పోరాడతానని పాండ్యరాజన్ అన్నారు. ముఖ్యమంత్రి పదవిలో పనీర్ సెల్వం కొనసాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అయన అన్నారు.

తమిళనాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న పాండ్యరాజన్ నిన్నటివరకు కూడా పన్నీర్ సెల్వం ని విమర్శిస్తూ వచ్చారు. శశికళను అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఆయన ఒక్కసారిగా పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోవడం విశేషం.ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ఆయన తెలిపారు.పన్నీర్ సెల్వం కు మద్దత్తు ప్రకటించిన పాండ్యరాజన్ ఆయన ఎప్పుడు భేటీ అవుతారనే విషయం తెలియాల్సి ఉంది.