`మా` గొడ‌వ‌లోకి మెగాస్టార్‌ని లాగొద్దు!?

Monday, September 3rd, 2018, 02:34:36 PM IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌ (మా)లో గ్రూప్ పాలిటిక్స్ అంత‌కంత‌కు ర‌చ్చ‌కెక్క‌డం చ‌ర్చ‌కొచ్చింది. మా అధ్య‌క్షుడైన శివాజీరాజాపై మా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. శివాజీరాజా నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్ర‌ఖ్యాత ఆంగ్ల ప‌త్రిక‌లో క‌థ‌నం వెలువ‌డ‌డంతో గొడ‌వ ర‌చ్చ‌కెక్కింది. ఆ క్ర‌మంలోనే శివాజీరాజా స‌ద‌రు ప‌త్రికా ప్ర‌తినిధితో గొడ‌వ‌ప‌డ్డార‌ని, తిట్టార‌ని మ‌రో క‌థ‌నం స‌ద‌రు ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైంది.

ఈ గొడ‌వ‌లోకి మెగాస్టార్‌ని లాగొద్ద‌ని శివాజీరాజా స‌ద‌రు ప‌త్రికాధిప‌తిని తిట్ట‌డంపైనా స‌ద‌రు క‌థ‌నం ప్ర‌త్యేకంగా పేర్కొంది. అసోసియేష‌న్ క‌మిటీలో 11 మంది స‌భ్యులు శివాజీరాజాకు వ్య‌తిరేకంగా ఉన్నార‌ని, ముగ్గురు న‌లుగురు మాత్ర‌మే అత‌డికి మ‌ద్ధ‌తిస్తున్నార‌ని స‌ద‌రు క‌థ‌నం వెల్ల‌డించింది. మొత్తానికి మూవీ ఆర్టిస్టుల సంఘంలో శివాజీరాజా వ‌ర్గం, న‌రేష్ వ‌ర్గం విడివిడిగా ఒక‌రిపై ఒక‌రు ఆరోపించుకోవ‌డంతో అది కాస్తా ర‌చ్చ‌వుతుండ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక‌పోతే నిధుల దుర్వినియోగంపై మా అసోసియేష‌న్ వివ‌ర‌ణ ఇస్తూ మీడియా ముఖంగా నేటి ఉదయం మాట్లాడింది. శివాజీరాజా నేరుగా త‌న‌పై ఆరోప‌ణ‌ల్ని స‌వాల్ చేశారు. మొత్తానికి ఈ గొడ‌వ‌లతో `మా` అసోసియేష‌న్ ప‌రువు మ‌రోసారి బ‌జారుకెక్కింది. గ్రూప్ రాజ‌కీయాల‌తో టాలీవుడ్ ప‌రువు మ‌రోసారి ర‌చ్చ‌కెక్కుతోంది. ఇటీవ‌లి `శ్రీ‌రెడ్డి` విష‌యంలో ఓసారి ప‌రువు పోయింది. ఇప్పుడు మ‌రోసారి ఇంటిగుట్టును బ‌య‌ట‌పెట్టేవాళ్ల‌తో ప‌రువు బ‌జారుకెక్క‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఇక నేటి స‌మావేశంలో శివాజీరాజా మీడియా లైవ్‌లోనే ప్ర‌త్య‌ర్థుల్ని బూతు ప‌దాల‌తో తిట్టేయ‌డంపైనా చ‌ర్చ సాగుతోంది. కొంద‌రు `మా`లోని వెద‌వ‌ల వ‌ల్ల‌నే ఇలా ప‌రువు బ‌జారుకెక్కుతోంద‌ని శివాజీరాజా ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments