5 కోట్ల నిధులుండీ సొంత‌ బిల్డింగ్ లేదు!

Monday, September 3rd, 2018, 02:44:07 PM IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ తాజా లొల్లు కొన్ని క‌ఠోర స‌త్యాల్ని బ‌య‌టి ప్ర‌పంచానికి లీక్ చేస్తోంది. ప్ర‌స్తుతం దీనిపై టాలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. పాతికేళ్ల ప్ర‌స్థానం ఉన్న `మా అసోసియేష‌న్` సొంతంగా బిల్డింగ్ నిర్మించుకోలేనంత ధైన్యంలో ఉందా? ఇన్నాళ్లు ఆ క‌ల‌ నెర‌వేర‌క‌పోవడం వెన‌క కొన్ని స్వార్థ‌పూరిత శ‌క్తుల కుట్ర దాగి ఉందా? అంటే అవున‌నే అర్థ‌మ‌వుతోంది. వాస్త‌వానికి 700 మంది పైగా స‌భ్యులున్న మా అసోసియేష‌న్‌లో అన్నీ బిగ్ షాట్స్ కొలువున్నాయి. సొంత బిల్డింగ్ క‌ట్టాలి అనుకుంటే .. అందులో చిత్త శుద్ధి ఉంటే ఈపాటికే సొంత భ‌వంతిని నిర్మించుకోగ‌లిగి ఉండేవారు. కానీ త‌ప్పు ఎక్క‌డ జ‌రుగుతోంది? లోపం ఎక్క‌డ ఉంది? అంటూ ప్ర‌స్తుతం ఆరాలు మొద‌ల‌య్యాయి.

ప‌దేళ్ల నుంచి `మా` సొంత బిల్డింగ్ నిర్మించాల‌ని క‌ల‌లు కంటున్నాం. ఇప్ప‌టివ‌ర‌కూ డ‌బ్బు లేక ఆగిపోవాల్సి వ‌చ్చింద‌ని శివాజీరాజా చేసిన వ్యాఖ్యానాన్ని బ‌ట్టి.. ఇంత‌కుముందు మా అధ్య‌క్షులుగా ప‌ని చేసిన‌వారెవ‌రూ అస‌లు సొంత బిల్డింగ్ నిర్మించేందుకు కృషి చేయలేదా? అన్న ప్ర‌శ్న త‌లెత్తింది. “కొంత మంది `మా` లో ఉన్న వెధ‌వ‌ల కార‌ణంగా చీలిక ఏర్ప‌డింది. ప్రస్తుతం సంఘానికి 5లో కోట్ల నిధులున్నాయి. సొంతంగా బిల్డింగ్ క‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాం“ అంటూ శివాజీరాజా ఇచ్చిన వివ‌ర‌ణ‌ను బ‌ట్టి.. ఈ త‌ప్పు ఎవ‌రిది? అన్న ప్ర‌శ్న ఎదురైంది. ఎన్నిక‌ల వేళ మా అసోసియేష‌న్ లో ఏళ్ల‌కు ఏళ్లుగా పేరుకుపోయిన అస‌లు మ‌కిలి బ‌య‌ట‌కు వ‌స్తోంది. కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ సంఘాలు సొంతంగా భ‌వంతుల నిర్మాణానికి ఎంట‌ర్ ప్రెన్యూన‌ర్ విష్ణు ఇందూరి స‌హాయం చేశారు. మా అసోసియేష‌న్ భ‌వంతిని ఆయ‌న నిర్మిస్తామంటే కొన్ని స్వార్థ‌పూరిత శ‌క్తుల ప్రాప‌కం వ‌ల్ల‌ వ‌దులుకున్నార‌ని శివాజీరాజా ఆరోపించారు. “మురళీ మోహాన్ హయంలో విష్ణు ఇందుకూరి సొంతంగా బిల్డింగ్ నిర్మిస్తాన‌ని ఆఫ‌ర్ ఇచ్చారు . కానీ దాన్ని కొంత‌మంది చెడ‌గొట్టారు. ఇప్పుడేమో ఇలా ప‌డి ఏడుస్తున్నారు. అయినా ఎవ‌రు ఎలా ఏడ్చినా? సొంతంగా ఈ ఏడాది బిల్డింగ్ నిర్మిస్తాం“ అంటూ `మా` వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ అన‌డాన్ని బ‌ట్టి ఏళ్ల‌కు ఏళ్లుగా ఏం జ‌రుగుతోందో అర్థం చేసుకోవ‌చ్చు. మొత్తానికి రూ.5కోట్ల నిధితో మా అసోసియేష‌న్ సొంత బిల్డింగ్ నిర్మించుకోవ‌డం క‌ష్ట‌మేమీ కాదు. సొంత భ‌వంతి అంటే ఇంకా ఫండ్‌ని క‌లెక్ట్ చేయ‌డం పెద్ద మ్యాట‌రేమీ కాదు. మ‌రి ఆ ప్ర‌య‌త్నం నిజాయితీగా జ‌రుగుతుందా? అన్న‌ది చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments