టాలీవుడ్ లో మరో వారసుడు!

Wednesday, July 11th, 2018, 05:56:39 PM IST

గత కొంత కాలంగా తెలుగు సినిమా పరిశ్రమలోకి వారసులు ఎక్కువగా పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. సపోర్ట్ తో కాకుండా వారి సొంత టాలెంట్ తో పైకొచ్చిన వారే ఎక్కువ క్లిక్ అవుతున్నారు. ఇక ఇప్పుడు సీనియర్ నటుడు మా అధ్యక్షుడు శివాజీరాజా తనయుడు కూడా వెండితెరకు ఎంట్రీ ఇవ్వనున్నాడు. శివాజీ రాజా తనయుడు శివాజీరాజా ఇప్పటికే నటనలో అలాగే డ్యాన్సులలో శిక్షణ తీసుకొని మంచి మాస్ హీరోల రెడీ అయ్యాడు.

బిగ్ బాస్ లో ప్రస్తుతం నాని ఎక్కువగా వాడుతున్న ‘ఏదైనా జరగవచ్చు’ అనే పదాన్ని సినిమా టైటిల్ గా సెట్ చేసుకున్నారు. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో సినిమా లాంచింగ్ కార్యక్రమాలను ఈ రోజు మొదలుపెట్టారు. శివాజీ రాజా నటనలో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కమెడియన్ పాత్రల్లోనూ అలాగే ఎమోషనల్ క్యారెక్టర్స్ లో ఆయనకు చాలా ప్రశంసలు అందాయి. అయితే మా అధ్యక్షుడిగా కొనసాగుతున్న తరువాత శివాజీ నటనకు దూరంగా ఉంటున్నారు. ఇక ఇప్పుడు ఆయన తనయుడు నటవారసుడిగా హీరోగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

  •  
  •  
  •  
  •  

Comments