మా అధ్యక్షుడు తోకలు కత్తిరిస్తారని చెప్పింది వీళ్ళ గురించేనా ?

Friday, February 16th, 2018, 01:09:07 PM IST

మా .. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమంలో పలువురు హీరోయిన్స్ పాల్గొనడం లేదని, కొందరు సభ్యత్వం కూడా తీసుకోవడం లేదని మా అధ్యక్షుడు శివాజీ రాజా అన్నారు. ప్రస్తుతం మా అసోసియేషన్ సిల్వర్ జూబిలీ వేడుకలను నిర్వహిస్తున్న సందర్బంగా ఓ మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ .. తెలుగు పరిశ్రమ పెంచి పోషిస్తున్న నటీమణులు కనీసం సభ్యత్వం కూడా తీసుకోవడం లేదని, అలంటి వారి తోకలను కత్తిరిస్తామని అన్నారు. దాంతో ఆ హీరోయిన్స్ ఎవరనే విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న తమన్నా. కాజల్ లు ఇంతవరకు మా అసోసియేషన్ లో ఎలాంటి సభ్యత్వం తీసుకోలేదని విషయం తెలిసినది. హీరోయిన్స్ గా వెలుగొందుతూ .. కోట్ల రూపాయలను సంపాదిస్తున్న వీరు కనీసం సభ్యత్వం తీసుకోకపోవడం దారుణం అంటున్నారు. సో వీళ్ళలాంటి వారే ఇంకొందరు హీరోయిన్స్ ఉన్నారని టాక్. మొత్తానికి వాళ్లతో పాటు ఇతర హీరోయిన్స్ ప మా గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయింది.