శ్రీరెడ్డి విషయంలో ‘మా’ తీరును తప్పుపట్టిన ప్రముఖ హీరో!

Thursday, April 19th, 2018, 07:30:53 PM IST

ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ విషయం పోరాటం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. గాయత్రిగుప్తా, మాధవీలత, శ్రీరెడ్డి తదితరులు టాలీవుడ్ లో అవకాశాల కోసం వచ్చే తెలుగు అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నారని, ఈ విష‌యంలో న్యాయం జరగడంలేదని ఆమె మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేష‌న్ (మా) ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసింది. అయితే తొలుత ఆమెకు మా సభ్యత్వం ఇవ్వము అనడం, తరువాత కొద్దిరోజులకు మళ్ళి ఇస్తాము అనడం జరిగింది. అయితే ఈ పూర్తి వ్యవహారం ప్రస్తుతం పెద్ద దుమారాన్ని రేపుతోంది. అయితే ఈ విషయమై మా వ్య‌వ‌హ‌రించిన తీరు విమర్శ‌ల‌పాల‌వుతోంది. తాజాగా సినీ న‌టుడు, మోహ‌న్‌బాబు త‌న‌యుడు మంచు విష్ణు మాపై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతూ ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు.

శ్రీరెడ్డి వ్య‌వ‌హారంలో మా వ్య‌వ‌హ‌రించిన తీరు సరిగ్గా లేదంటూ ‘మా’ అధ్య‌క్షుడికి లేఖ రాశారు. ఇటీవ‌లి కాలంలో కొన్ని విష‌యాల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేష‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు నన్ను చాలా బాధించింది. తెలుగు సినిమా వాళ్ల సంక్షేమం కోసం ఈ సంఘం ఏర్ప‌డింది. ‘మా’లో మెంబ‌ర్‌షిప్ లేని ఓ వ్య‌క్తి విష‌యంలో ‘మా’ వ్య‌వ‌హ‌రించిన తీరు గంద‌ర‌గోళంగా ఉంది. ఆమె చేసిన ఆరోప‌ణ‌ల కార‌ణంగా హ‌డావిడిగా స‌మావేశం నిర్వ‌హించి ‘మా’లో స‌భ్య‌త్వం ఉన్న 900 మందిలో ఎవ‌రూ ఆమెతో న‌టించ‌కూడద‌ని నిషేధం విధించారు. అయితే ఆ 900 మందిలో మా నాన్న‌గారు, నేను, మా అక్క‌, మా త‌మ్ముడు కూడా ఉన్నాం. మ‌మ్మ‌ల్ని కూడా క‌లిపే చెప్పారా, ఓ న‌టుడిగా, నిర్మాత‌గా ఎవ‌రితో న‌టించాల‌నే విష‌యంలో నిర్ణ‌యం తీసుకోవాల్సిన హ‌క్కు నాకుంది.

ఆ విష‌యంలో మీరు ఆదేశాలు జారీ చేయ‌కూడ‌దు. మొదట ఆమెకు సభ్యత్వం అన్న మీరు, ఆమె సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన పెద్ద కుటుంబాల‌పై, వ్య‌క్తుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌గానే ఆ నిషేధం ఎత్తేశారు. ఇలాంటి అనాలోచిత నిర్ణ‌యాల వ‌ల్ల మా ప‌రువు పోతోంది. ప్ర‌జ‌ల‌, మీడియా దృష్టిలో చుల‌క‌న అయిపోతోంది. ద‌య‌చేసి మీ చ‌ర్య‌ల‌తో ‘మా’కు చెడ్డ పేరు తీసుకురాకండి. ముందుగా ‘మా’కు మార్గ‌ద‌ర్శ‌కాలు ఏర్పాటు చేయండి. సినీ ప‌రిశ్ర‌మకు చెందిన 24 క్రాఫ్ట్‌లు త‌ప్ప‌నిస‌రిగా ఆ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించే విధంగా చ‌ర్య‌లు తీసుకోండి. ప్ర‌స్తుతం ‘మా’లో స‌భ్య‌త్వం లేని స్థానిక న‌టులు చాలామంది ఉన్నారు. వారంద‌రితో నేను న‌టించొచ్చా ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెడ్డ‌పేరు తీసుకొస్తున్నాయి. ఈ విష‌యంలో గ్రీవియెన్స్ సెల్ ఏర్పాటు బాధ్య‌తను ‘మా’కు కాకుండా ఫిల్మ్ ఛాంబ‌ర్‌కు అప్ప‌గించాలి, అని అంటూ అయన తన అభిప్రాయాన్ని తెలియచేసారు. అయితే ఈ విషయమై మా సంఘం స్పందించవలసి వుంది……

  •  
  •  
  •  
  •  

Comments