రెడ్‌స్టార్ కోసం క‌దిలొచ్చారు

Wednesday, June 6th, 2018, 06:04:54 PM IST


విప్ల‌వ‌న‌టుడు, నిర్మాత‌, ప్ర‌జానాట్య‌మండ‌లి క‌ళాకారుడు, రెడ్‌స్టార్ మాదాల‌రంగారావు సంస్మ‌ర‌ణ స‌భ హైద‌రాబాద్‌- సైబ‌ర్ క‌న్వెన్ష‌న్‌లో జ‌రిగింది. ఈ స‌భ‌లో ఫిలిం ఇండస్ట్రీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు, క‌మ్యూనిస్టు నేత‌లు, ప్ర‌జానాట్య‌మండ‌లి, అభ్యుద‌య క‌ళాకారులు పాల్గొన్నారు. న‌టుడు, ఎంపీ ముర‌ళి మోహ‌న్‌, మాదాల ర‌వి, బి.గోపాల్‌, వందేమాత‌రం శ్రీ‌నివాస్‌, బ్ర‌హ్మానందం, ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్య ం, బెన‌ర్జీ, క‌విత‌, ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, భీమ‌నేని శ్రీ‌నివాస‌రావు, గోపిచంద్ మ‌లినేని, ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్‌, గౌతంరాజు, రేలంగి న‌ర‌సింహారావు త‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

మాదాల తెర‌కెక్కించిన సినిమాలతో ప్ర‌జ‌ల్లో ఎంతో అవేర్‌నెస్ వ‌చ్చింద‌ని.. ఆయ‌న విప్ల‌వ‌భావాలు అంద‌రిలో స్ఫూర్తి నింపాయ‌ని వ‌క్త‌లు వ్యాఖ్యానించారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. చైర్మన్ చెలమయ్య సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రంగారావు.. నవతరం పిక్చర్స్ ప‌తాకంపై యువతరం కదిలింది, ఎర్ర మల్లెలు, మహాప్రస్థానం, ప్రజాశక్తి, వీరభద్రుడు, స్వరాజ్యం, మరో కురుక్షేత్రం, ఎర్ర సూర్యుడు, ఎర్ర పావురాలు వంటి చిత్రాలను నిర్మించి, నటించారు. నవతరం ప్రొడక్షన్స్‌‌పై మాదాల రంగారావు 1980లో తీసిన ‘యువతరం కదిలింది’ ఉత్తమ చిత్రంగా ఎంపికై బంగారు నంది పురస్కారం దక్కించుకుంది. వామపక్ష భావజాలం కలిగిన రంగారావు.. అవినీతి, అణచివేత లాంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు రూపొందించిన సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments