వైరల్ వీడియో : కట్నం కోసం గొంతు కోసారా..?

Saturday, April 14th, 2018, 05:52:10 PM IST

అమ్మాయిలతో అశ్లీల ప్రవర్తనలు, అన్యాయంగా బలవంతంగా కిడ్నాపులు చేసి మాన భంగం చేసి ప్రాణాలు తీస్తున్నవాళ్ళు ఒకవైపైతే వరకట్న వేధింపులకు ఎందరో అమాయక అమ్మాయిల జీవితాలు బలి చ్స్తున్నవారు ఇంకొందరు. పుట్టినింటికి పుత్తిడిబొమ్మ అయిన ఆ అబల.. భర్త ఇంటికెళ్లిన తర్వాత అత్తమామలు, ఆడపడుచులు కలిసి ఆమెను కాటికి పంపిస్తున్న ఘటనలు చాలా ఉన్నాయి. పెళ్లైన కొద్ది రోజులకే ఆడబిడ్డల ఊపిరి తీస్తున్నారు అత్తమామలు, ఆడపడుచులు. వరకట్న వేధింపులకు ఒక అమాయకురాలు బలైంది. ఈ యధార్థ ఘటనను చూసిన కవి రాజేందర్ గణపురం చలించి ఓ జానపద గేయం రాశాడు. ఆ గేయాన్ని గాయకురాలు ప్రసన్న విజయ కుమార్ అద్భుతంగా పాడారు. వికారాబాద్ కు చెందిన ప్రసన్న.. మన్నెగూడ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తుంది. భజన, భక్తి గీతాలు ఆలపించే ప్రసన్న.. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని.. సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

  •  
  •  
  •  
  •  

Comments