అనసూయ, రష్మీ లకు…షాక్ ఇస్తుందట !!

Tuesday, November 22nd, 2016, 11:36:14 PM IST

madhavilatha
టెలివిజన్ రంగంలో ఇప్పుడు హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ .. మత్తెక్కిస్తున్నారు హాట్ యాంకర్స్ అనసూయ, రష్మీ !! ఇప్పటికే వీరి ధాటికి చాలా మంది యాంకర్స్ వెనకపడిపోయారు కూడా. ‘జబర్దస్త్’ ప్రోగ్రాంతో బాగా పాపులర్ అయిన వీరిద్దరికి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతుందో తెలుగు హీరోయిన్ !! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా .. ఆ మధ్య ”నచ్చావులే” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హాట్ క్యూటీ .. మాధవీలత, ఆ తరువాత ”స్నేహితుడా” సినిమాలో మెరిసిన ఈ భామకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దాంతో లేటెస్ట్ గా ఓ షార్ట్ ఫిల్మ్జ్ లో హాట్ హాట్ గా నటించి షాక్ ఇచ్చింది. మరో వైపు సోషల్ మీడియాలో బాగానే పాపులారిటీ తెచ్చుకున్న ఈ చిన్నది యాంకర్ గా టర్నింగ్ ఇవ్వడానికి రెడీ అయింది? త్వరలోనే జబర్దస్త్ లాంటి ఓ కార్యక్రమాన్ని … జబర్దస్త్ కు పోటీగా రూపొందిస్తున్నారట !! ఇందులో యాంకర్ గా మాధవి లత కనిపిస్తుందని తెలిసింది. ఈ కార్యక్రమం ఒక్కటే కాకుండా మరో రెండు టివి ప్రోగ్రామ్స్ కూడా చేస్తుందట !! మొత్తానికి యాంకర్ గా అటు అనసూయ, రష్మీ, శ్రీ ముఖి లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధం అయింది !