శశికళ భవిష్యత్తు ఎన్నికల సంఘం చేతుల్లో..షాకిచ్చిన మధుసూదనన్ !

Friday, February 10th, 2017, 09:08:04 PM IST


అన్నా డీఎంకే పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ భారత ఎన్నికల సంఘానికి లేఖరాశారు. దీనిని కనుక ఎన్నికల సంఘం ఈ లేఖని సీరియస్ గా తీసుకుంటే శశికళ రాజకీయ భవితవ్యం ముగిసినట్లే అని చర్చించుకుంటున్నారు. అన్నా డీఎంకే పార్టీ శశికళని పార్టీ ప్రధాన కార్య దర్శిగానియమిస్తూ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్మానాన్ని తోసిపుచ్చవలసిందిగా ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు.

పార్టీ నిబంధనల ప్రకారం వరుసగా ఐదేళ్ల పాటు పార్టీ లో సభ్యత్వం ఉన్నవారు మాత్రమే ఆ పదవికి అర్హులని ఆయన లేఖలో పేర్కొన్నారు. అమ్మ మరణానంతరం శశికళని పార్టీ ప్రధాన కార్యదర్శిగా అన్నా డీఎంకే ఎన్నుకున్న విషయం తెలిసిందే. కాగా తాత్కాలిక పదవిలో ఉన్న శశికళను పదవి నుంచి ఏఒక్కరినీ బహిష్కరించే హక్కు లేదని పన్నీర్ వర్గం వాదిస్తోంది.ఈ పరిణామాలన్నింటి మధ్య తమిళ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి.