‘ఐ’ కు హైకోర్ట్ బ్రేక్

Thursday, January 8th, 2015, 07:41:25 PM IST

i-movie
ప్రముఖ హీరో విక్రం హీరోగా, విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఐ. ఈ సినిమా ఇప్పుడు విడుదల కష్టాల్లో కురుకు పోయింది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన ఐ చిత్రంను విడుదల చేయకుండా నిలిపివేయాలని మద్రాస్ హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఎప్పుడు విడుదల చేయాలి అన్న విషయాన్ని కోర్ట్ దృవీకరించలేదు. మాములుగా ఈ చిత్రాన్ని ఈనెల 9న విడుదల చేయాలని అనుకున్నారు. కాని, తరువాత, సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదల చేయాలని భావించారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తీచేసుకున్న ఈ చిత్రం విడుదల వాయిదా పడటంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. గత మూడు సంవత్సరాలుగా ఐ సినిమా నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే.