లేడి లెక్చరర్ పై మరో లెక్చరర్ కత్తితో దాడి..ఆ యూనివర్సిటీలో ఏంజరిగింది..?

Tuesday, September 26th, 2017, 02:03:10 PM IST


మహిళా లెక్చరర్ పై 15 సార్లు కత్తితో దాడి చేసిన ఘటన మధురై కామరాజు యూనివర్సిటీలో జరిగింది. యునివేర్సిటి లో జెనీఫా అనే మహిళా లెక్చరర్ జర్నలిజం అండ్ సైన్స్ విభాగానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ గా పనిచేస్తున్నారు. మురుగన్(32) అనే మరో వ్యక్తి పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. 2016-17 విద్యాసంవత్సరం లో అతడు పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేశాడు.

కాగా 2017-18 విద్యాసంవత్సరంలో అతడిని ఉద్యోగంలోకి తీసుకోలేదు. అతడి నియామకానికి జెనీఫా నిరాకరించింది. ఆ తరువాత మురుగన్ జెనీఫా ని తరచుగా కలుస్తూ ఉద్యోగం కోసం అడిగాడు. కానీ జెనీఫా అతడి అభ్యర్థనని నిరాకరించింది. తాజాగా మురుగన్ మంగళవారం యూనివర్సిటీ క్యాంపస్ లోని జెనీఫా ఛాంబర్ లో ఆమెని కలుసుకున్నాడు. ఆ సమయం ఆమెతో గొడవపెట్టుకున్న మురుగన్ కత్తితో ఆమెని తీవ్రంగా గాయపరిచాడు. 15 సార్లు జెనీఫా పై కత్తితో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. యునివేర్సిటి సిబ్బంది ఆమెని మధురై లోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీస్ లు విచారణ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments