యువ‌తంబీ `మ‌గ‌ధీర-2`లో న‌టిస్తున్నాడా?

Saturday, February 17th, 2018, 10:28:44 PM IST

చూసేందుకు సింపుల్‌గా ప‌క్కింటి కుర్రాడిలా క‌నిపించే శివ‌కార్తికేయ‌న్ .. త‌మిళంలో వ‌రుస విజ‌యాలు సాధిస్తూ హీరోగా స‌త్తా చాటుతున్నాడు. ఇతడి సినిమాల‌న్నీ మినిమం గ్యారెంటీతో న‌డిచిపోతుండ‌డంతో అవ‌కాశాల‌కేం కొద‌వ లేదు. ఓవైపు సొంతంగానే బ్యాన‌ర్ ప్రారంభించి, అందులో త‌న సినిమాలు తానే నిర్మించుకుంటున్నాడు. అప్ప‌ట్లో ఓ ఫైనాన్స్ ఇష్యూలో కజిన్‌ని కోల్పోయాడు.

ఆ క‌థంతా అటుంచితే లేటెస్టుగా శివ‌కార్తికేయ‌న్ న‌టిస్తున్న `సీమ రాజా` ఫ‌స్ట్‌లుక్ రిలీజైంది. గుర్రంపై మ‌గ‌ధీర‌లా క‌నిపిస్తున్నాడు. మ‌న రామ్‌చ‌ర‌ణ్ త‌ర‌హాలోనే గుర్ర‌పుస్వారీలో ఆరితేరిపోయాడా? అన్న‌ట్టు ఉందా ఫోజు. తొలి లుక్ అదిరింది. అంద‌రికీ క‌నెక్ట‌యింది. ఈ చిత్రంలో అందాల స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శిలంబం అనే మార్ష‌ల్ ఆర్ట్స్ లో ఆరితేరిన అమ్మ‌డిగా త‌ను క‌నిపిస్తుందిట‌. సామ్ లుక్‌ని త్వ‌ర‌లోనే లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే శివ‌కార్తికేయ‌న్ ఈ సినిమాలో ఫ‌న్నీ రోల్‌లో న‌టిస్తున్నాడ‌ని టైటిల్ చెబుతోంది.