జపాన్ లో “మగధీర” క్రేజ్ మాములుగా లేదుగా.!

Tuesday, October 9th, 2018, 07:44:53 PM IST

2009 వ సంవత్సరంలో రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ హీరోగా కాజల్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం “మగధీర” ఈ చిత్రం అప్పుడు ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో వేరే చెప్పక్కర్లేదు.దానికి నిదర్శనంగా అప్పటికి వరకు ఉన్న రికార్డులను అన్ని తుడిచిపెట్టేసింది.ఈ చిత్రం సాధించిన మరో అరుదైన రికార్డు 100 రోజులు దాదాపు 200 సెంటర్లలో దిగ్విజయంగా ప్రదర్శింపబడింది ఈ రికార్డును ఐతే ఎవ్వరు దాటలేకపోయారు.బాహుబలి తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి ఇంకా పెరిగింది,దీనితో వేరే దేశాల్లో కూడా మన చిత్రాలను విడుదల చేస్తున్నారు.

అదే విధంగా మగధీర చిత్రంను కూడా జపాన్ దేశంలో విడుదల చేశారు.మన దగ్గర కాదు కానీ అక్కడ ఈ చిత్రానికి వచ్చిన స్పందన మన భారతీయ చిత్రాల్లో రజిని,అమీర్ బాహుబలి వంటి చిత్రాలు కూడా నిలబడలేకపోయాయి.వారికి ఎంతగా ఈ చిత్రం నచ్చిందంటే మగధీర చిత్రంలో ఉన్నటువంటి ప్రతీ ముఖ్య పాత్రను అక్కడి జపనీయులు ధరించేస్తున్నారు.ఒక్క సారి ఈ ఫోటోలను చూస్తే మీకే అర్ధమవుతుంది మన తెలుగు వాడి సినిమాకి వేరే దేశంలో వస్తున్న క్రేజ్ మాములుగా లేదని మీరే అంటారు.