“కాల భైరవ(వు)”డి వేట ఇప్పుడప్పుడే ఆగేలా లేదుగా..!

Saturday, September 8th, 2018, 04:43:19 PM IST

“మెగా పవర్ స్టార్ రామ్ చరణ్” హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “మగధీర” చిత్రం ఇటీవలే జపాన్ లో విడుదల అయ్యిన సంగతి తెలిసిందే.. ఈ చిత్రం అక్కడ మామూలు ప్రభంజనం సృష్టించట్లేదు. ప్రతి రోజు ఏదొక వార్త వస్తూనే ఉంది. మగధీర చిత్రం అక్కడ విడుదల అయ్యినప్పుడు నుంచి అక్కడి ప్రకంపనలు ఆగట్లేదు. అన్ని వేల కోట్లు సాధించిన “బాహుబలి ది కన్క్లూషన్” యొక్క లాంగ్ రన్ షేర్ ను మగధీర అక్కడ కేవలం 6 రోజుల్లోనే దాటేసింది అంటేనే అర్ధం చేసుకోవచ్చు. జపాన్ లో మన మగధీర చిత్రానికి ఎలా బ్రహ్మ రథం పడుతున్నారో..

ప్రస్తుతం ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో మూడో స్థానంలో ఉంది ఇప్పుడు మగధీరుడి కన్ను అమీర్ “3 ఇడియట్స్” చిత్రం మీద పడింది. అక్కడి మార్కెట్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ టాప్ 4 సినిమాలు వరుసగా “ముత్తు” 1.6 మిలియన్లు(11.5కోట్లు), “3 ఇడియట్స్” 1.48 మిలియన్లు(10.6కోట్లు), “మగధీర” 1.38మిలియన్లు(9.91కోట్లు) 6 రోజులకి , “బాహుబలి 2” 1.3మిలియన్(9.21కోట్లు) గా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మగధీర పూర్తి రన్ అయ్యేసరికి ముత్తు కలెక్షన్ ని అవలీలగా దాటేస్తుంది అని సినీ ప్రేమికులు అంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments