లిరికల్ వీడియో : మహానటి మొదటి పాట వచ్చేసింది…

Saturday, April 21st, 2018, 09:41:23 AM IST

అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం మహానటి. కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తున్నది. నాగ అశ్విన్ దర్శకుడు. ప్రియాంకదత్ నిర్మాత. సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్‌సల్మాన్ కీలక పాత్రధారులు. ఈ సినిమాలో మూగమనసులు.. అనే లిరికల్ గీతాన్ని చిత్రబృందం శుక్రవారం విడుదలచేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ గీతానికి మిక్కీ జే మేయర్ స్వరాలను సమకూర్చారు. శ్రేయాఘోషల్, అనురాగ్ కులకర్ణి అలపించారు. నిర్మాత మాట్లాడుతూ పీరియాడిక్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. సావిత్రి సినీ, వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం. జెమిని గణేషన్,సావిత్రి మధ్య ప్రేమను చాటిచెప్పే ఈ గీతం సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది అని అన్నారు. ఇటీవల విడుదలైన టీజర్, కీర్తిసురేష్, సమంత ఫస్ట్‌లుక్‌లకు చక్కటి స్పందన లభిస్తున్నది. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. తాజాగా విడుద‌లైన ‘మూగ మనసులు..’’ అంటూ సాగే ఈ గీతం ఆ నాటి లోకంలో విహ‌రిస్తున్న అనుభూతి క‌లిగిస్తుంది. ఆ సాంగ్ మీరు విని ఎంజాయ్ చేయండి.

  •  
  •  
  •  
  •  

Comments