జోరు పెంచిన … మహానటి ?

Wednesday, May 16th, 2018, 03:51:33 PM IST

మహానటి .. కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం మహానటి. మహానటిగా అందరి అభిమానాన్ని అందుకున్న సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. విడుదలైన ప్రతి చోటనుండి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో సినిమా అభిమానులు వెల్లువెత్తుతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు నటించిన ఈ సినిమా అటు ఓవెర్సెస్ లోని భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. ముక్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి బ్రహ్మరధం పడుతున్నారు. మరి మహానటి సినిమా కేవలం 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే 20 కోట్లకు పైగా షేర్ వసూళ్లు అందుకోవడం విశేషం. మరి మహానటి 6 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం .. షేర్ లలో …

 

ఏరియా కలెక్షన్లు
నైజాం 4. 02 కోట్లు
సీడెడ్ 0. 95 కోట్లు
ఉత్తరాంధ్రా 1. 25 కోట్లు
ఈస్ట్ 0. 67 కోట్లు
వెస్ట్ 0.43 కోట్లు
కృష్ణా 0.89 కోట్లు
గుంటూరు 0.71 కోట్లు
నెల్లూరు 0.22 కోట్లు
కర్ణాటక 0.08 కోట్లు
తమిళ నాడు 0.58 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా 0.92 కోట్లు
అమెరికా 7.02 కోట్లు

మొత్తంగా ఆంధ్రా , తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 9. 32 కోట్లు,
ఇక ప్రపంచ వ్యాప్తంగా కలిపి 19. 72 కోట్ల షేర్ సాధించింది.