తిరుమల వెంకన్నను దర్శించుకున్న మహానటి

Tuesday, May 15th, 2018, 11:21:42 AM IST

తాజాగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలయిన సినిమా మహానటి. అలనాటి అభినయ నటి సావిత్రి జీవిత చరిత్రతో యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అభినయించి నిజంగే మహానటి అంటే ఆ కాలంలో సావిత్రి ఈ కాలంలో కీర్తి సురేష్ అని తెలుగు చిత్ర సీమ గర్వంగా చెప్పుకునే విదంగా చేసింది. అయితే మహానటి హీరోయిన్ కీర్తిసురేశ్ ఇవాళ తిరుమలను వెంకన్న స్వామిని దర్శించుకుంది. కీర్తిసురేశ్ తిరుమల శ్రీవారిని వీఐపీ విరామసమయంలో సందర్చిన్చుకున్నారు. ఉదయం స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని సినిమాకోసం తానూ చేసిన మొక్కులు స్వామివారికి చెల్లించుకున్నారు.

టీటీడీ ఆలయ అధికారులు దగ్గరుండి కీర్తి సురేశ్ కు ఎక్కడా ఇబ్బంది కలగకుండా దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం కీర్తిసురేశ్ కు ఆలయ రంగనాయకుల మండపంలో మహా పండితులు వేదం మంత్రాల సాక్షిగా ఆశీర్వచనం అందించి, స్వామి వారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కీర్తిసురేశ్ ను పట్టువస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా కీర్తి మీడియాతో మాట్లాడుతూ..మహానటి సావిత్రి జీవిత చరిత్ర చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహానటి సినిమా విజయవంతం కావడంతో స్వామివారి దర్శనానికి వచ్చినట్లు కీర్తి చెప్పారు. కాగా అక్కినేని నాగచైతన్య, సమంతా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments