అమెరికాలో మ‌హాన‌టి వ‌సూళ్ల ధ‌మాకా!

Thursday, May 10th, 2018, 09:55:58 AM IST

కీర్తి సురేష్ టైటిల్ పాత్ర పోషించిన `మ‌హాన‌టి` మిశ్ర‌మ స్పంద‌న‌ల మ‌ధ్య ఫ‌ర్వాలేద‌నే వ‌సూళ్లు సాధిస్తోంది. సావిత్రి బ‌యోపిక్ అన్న సింప‌థీ ఓపెనింగుల ప‌రంగా ఈ సినిమాకి బాగానే వ‌ర్క‌వుటైంద‌ని చెబుతున్నారు. ముఖ్యంగా ఓవ‌ర్సీస్‌లో మ‌హాన‌టి ప్రీమియ‌ర్ల రూపంలో బాగానే క‌లెక్ట్ చేసింది. అమెరికాలో దాదాపు 150 లొకేష‌న్ల‌లో ఈ సినిమా రిలీజైతే ప్రీమియ‌ర్ల రూపంలో ఏకంగా 303కె డాల‌ర్లు క‌లెక్ట‌య్యింది. అంటే దాదాపు 2కోట్లు అమెరికాలో వ‌సూలు చేసింది.

ఓవ‌ర్సీస్ ప్రీమియ‌ర్లలో అజ్ఞాత‌వాసి, భ‌ర‌త్ అనే నేను, రంగ‌స్థ‌లం చిత్రాలు టాప్ 3 ప్రీమియ‌ర్ల‌తో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ త‌ర‌వాతి స్థానం `మ‌హాన‌టి` ద‌క్కించుకుంద‌ని అమెరికా బాక్సాఫీస్ రిపోర్ట్ చెబుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ సావిత్రికి ఉన్న అసాధార‌ణ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఇక్క‌డా డే1 చ‌క్క‌ని వ‌సూళ్లు ద‌క్కాయ‌ని ట్రేడ్‌లో చెబుతున్నారు. ఈ వీకెండ్ మూడు రోజులు మ‌హాన‌టికి ఓకే కానీ, సోమ‌వారం నుంచి అస‌లు ప‌రీక్ష మొద‌ల‌వుతుంది. అప్పుడు బాక్సాఫీస్‌ ర‌న్ ఎలా ఉంటుంది? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్‌.

  •  
  •  
  •  
  •  

Comments