సాటిలైట్ రైట్స్ లో మహానటి క్రేజ్ ?

Friday, May 11th, 2018, 10:04:47 AM IST

ఇటీవలే విడుదలైన మహానటి చిత్రం అన్ని ప్రాంతాల్లో మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించగా ఎవడె సుబ్రహ్మణ్యం ఫేమ్ నాగ అన్వేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందునుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తరువాత అనుహ్యమైన స్పందన రావడంతో పాటు సావిత్రి అభిమానులందరూ జేజేలు పలుకుతున్నారు. విడుదలైన ప్రతి చోట మంచి స్పందన రావడంతో పాటు కలక్షన్స్ పరంగా బాగానే వర్కవుట్ అయింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందు సాటిలైట్ హక్కులను ఎవరు తీసుకోలేదు .. కానీ విడుదలైన మరుసటిరోజే ఈ సినిమా సాటిలైట్ హక్కులకు భారీ పోటీ ఏర్పడగా .. ఓ ప్రముఖ ఛానల్ ఏకంగా 10 కోట్లకు సొంతం చేసుకుంది. నిజంగా మహానటి సినిమా సాటిలైట్ హక్కులు ఈ రేంజ్ లో పలకడం విశేషం. స్టార్ హీరోలకు ధీటుగా ఈ హక్కులు అమ్ముద్దయ్యాయంటే మహానటి సినిమా స్టామినా ఏమిటో తెలుస్తోంది. సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య లాంటి ప్రముఖ నటీనటులు నటించిన మహానటి సావిత్రి జీవితాన్ని వెండితెరపై అద్భుత కావ్యంగా మలిచారంటూ దర్శకుడికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments