మహానటి .. సగమే బయటికి వచ్చిందేమిటి ?

Tuesday, October 17th, 2017, 01:33:05 PM IST

దక్షిణాది ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న నటి ఎవరంటే అందరు చెప్పే సమాధానం ఒక్కటే .. ఆమెనే మహానటి సావిత్రి. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో అద్భుత పాత్రల్లో నటించిన సావిత్రి జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కీర్తి సురేష్ ముఖ్యపాత్రలో సమంత , దుల్కర్ సల్మాన్ లు నటిస్తున్న ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తీ కావొచ్చింది. తాజాగా ఈ రోజు మహానటి పుట్టిన రోజు సందర్బంగా ఫస్ట్ లుక్ ని విడుదశల చేసారు .. మహానటి అంటే సావిత్రి అనుకునేరు .. కాదు ఆమె పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్బంగా యునిట్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. అయితే అందులో కేవలం కళ్ళతో బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న పోస్టర్ మాత్రమే విడుదల అయింది. దానికి తోడు .. ఆకాశ వీధిలో అందాల జాబిలీ అంటూ కొటేషన్ తో పోస్టర్ విడుదలైంది. సో సావిత్రి మొత్తం రూపం చూడాలంటే ఇంకాస్త టైం పట్టేలా ఉన్నటు హింట్ ఇచ్చారేమో .. మొత్తానికి అందరిని ఆసక్తి రేపుతున్న మహానటి సినిమా కోసం అందరి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments