సావిత్రి పాత్ర కోసమే పుట్టిందా?

Monday, April 30th, 2018, 04:07:16 PM IST

టాలీవుడ్ లో గత కొంత కాలంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా చిత్రం మహానటి. సావిత్రి బయోపిక్ గా వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. విడుడల చేస్తోన్న పోస్టర్స్ అండ్ సాంగ్స్ అందరిని ఎంతగానో ఆట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు ఆ సినిమాకు సంబందించిన పోస్టర్స్ లలో కీర్తి సురేష్ సావిత్రిలా ఉందని చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్ ని చుస్తే సావిత్రి పాత్ర కోసమే కీర్తి మళ్లీ పుట్టింది అని అనకుండా ఉండలేము. దేవదాసు సినిమాలోని ఒక స్టీల్ కి తగ్గట్టు కీర్తి ఉండడం ఆమె కాస్ట్యూమ్ కరెక్ట్ గా సెట్ అవ్వడం అందరిని ఎంతగానో ఆశ్చర్యపరచింది. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎండింగ్ కు వచ్చేసింది. మే 9న ఆ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments