మహానటి లో అతిపెద్ద మిస్టేక్ అదే!

Saturday, May 12th, 2018, 09:59:05 PM IST

సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా కు ప్రస్తుతం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శక ప్రతిభకు అగ్ర సినీ దర్శకుల నుంచి కూడా మచి కామెంట్స్ అందుతున్నాయి. ఇకపోతే సినిమాలో ఒక మిస్టేక్ గురించి మాట్లాడుకోవడం కూడా వైరల్ అవుతోంది. కానీ సినిమాలో ఆ సిన్ బాగా క్లిక్ అయ్యింది. సెకండ్ హాఫ్ లో సావిత్రి – ఎస్వీ రంగారావు పాత్రలకు సంబందించిన ఒక సిన్ ఉంటుంది. ఎస్వీఆర్ సావిత్రికి భోజనం పెట్టె సిన్. గోరింటాకు సినిమా షూటింగ్ లో అది జరిగినట్టు దర్శకుడు చూపించాడు. కానీ నిజానికి అప్పుడు ఎస్వీ రంగారావు గారు జీవించి లేరు. 1974లోనే ఆయన మరణించారు. 1979 లో గోరింటాకు షూటింగ్ జరిగింది. అయితే ఆ సిన్ పై దర్శకుడు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక వివరణ ఇచ్చాడు. తెలిసే చేశామని అప్పట్లో చక్రపాణి కేవీ.రెడ్డి వారు కూడా లేరు. ఆ సిన్ కరెక్ట్ గా రావాలంటే ఎస్వీఆర్ అయితే కరెక్ట్ అని చేయించినట్లు దర్శకుడు వివరించాడు.

Comments