విదేశాల్లో సత్తా చాటుతున్న మహానటి!

Sunday, May 13th, 2018, 05:53:47 PM IST

టాలీవుడ్ లో తెరకెక్కిన మొట్ట మొదటి బయోపిక్ మహానటి. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించిన సంగతి తెలిసిందే. ఆయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దీంతో కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే సినిమా మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. ఇప్పటికే అమెరికాలో ఈ సినిమా 1 మిలియన్ డాలర్లను అందుకుంది. స్టార్ హీరోలకు తగ్గట్టుగా మహానటి సావిత్రి పేరు మారు మ్రోగిపోతుందమ్మా ప్రశసించాల్సిన విషయం.

ఇక యూకే యూకే – న్యూజిలాండ్ వంటి దేశాల్లో భారత సినిమాలకు మార్కెట్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ మహానటి సినిమా మాత్రం ఎవరు ఊహించని విధంగా కలెక్షన్స్ ను అందుకుంటోంది.
యూకే లో15 లొకేషన్లలో రిలీజ్ అయిన సినిమా ఇప్పటివరకు రూ.25.90 లక్షలను అందుకొనగా న్యూజిలాండ్ లో కేవలం మూడు లొకేషన్లలో మాత్రమే రిలీజ్ అయిన మహానటి రూ.4.65 లక్షలను అందుకుంది. ఈ విషయాలన్నీ ప్రముఖ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎనలిస్ట్ తరన్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.