బాలీవుడ్ లో మహానటి రిలీజ్ కానుందట… ప్రొడ్యుసర్ ఎవరో తెలుసా

Thursday, May 17th, 2018, 10:10:01 AM IST

అద్భుత కళా పోషకురాలు, తన హావభావాలతో ప్రేక్షకుల మదిలో కవ్వింతలు పుట్టించేగొప్ప నటి సావిత్రి. ఆవిడ జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం మహానటి. మామూలు తెలుగు ప్రేక్షకుల మదిలోనే కాకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రతీ మనిషి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప చిత్రం ఇది. కీర్తి సురేష్ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు తమిళ భాషలలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రతీ సినీ అభిమానుల మన్నలను అందుకున్న ఈ చిత్రాన్ని ప్రస్తుతం దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట చిత్ర బృందం. ఇటివల అందిన సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఆదిత్యా చోప్రా ఇటివలే ఈ సినిమా చూసి బాగా నచ్చడంతో హిందీ డబ్బింగ్ రైట్స్ తమ కైవసం చేసుకున్నారని తెలిసింది.

ఇక దేశవ్యాప్తంగా ఈ సినిమాను హిందీ డబ్ లో రిలీజ్ చేయడానికి సిద్దపడ్డారని తెలిసింది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో చిత్రం పరిశ్రమకు పరిచయమైన దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, వైజయంతి మూవీస్ పతాకంపై ప్రియాంకా దత్, స్వప్నా దత్ లు నిర్మాతలుగా వహించారు. దుల్కర్ సల్మాన్, సమంతా, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, అవసరాల శ్రీనివాస్, శాలినీ పాండే, నాగ చైతన్య, రాజేంద్ర ప్రసాద్ లు తదితరులు ఈ సినిమాకి ముఖ్య పాత్రలు పోషించడం గమనార్హం. సినిమా కథా కథానికలు, నటీనటుల నటనా కౌశిల్యం ఈ సినిమాకు ప్రాణం పోయగా మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకి నిలువుటద్దం పట్టింది.