రికార్డ్ ధ‌ర‌కు `మ‌హాన‌టి` శాటిలైట్

Tuesday, May 15th, 2018, 02:15:40 AM IST

ఇంటా బ‌య‌టా మ‌హాన‌టి ప్ర‌భంజ‌నం సాగుతోంది. ఈ సినిమా కేవ‌లం ఓవ‌ర్సీస్ నుంచి పెట్టుబ‌డి మొత్తం తిరిగి తెచ్చేస్తోంది. అమెరికా నుంచి ఏకంగా 15కోట్ల మేర వ‌సూలు చేస్తుంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుత వ‌సూళ్లు సాధించింది. ఇదే క్ర‌మంలో ఈ సినిమా శాటిలైట్‌కి అసాధార‌ణ డిమాండ్ ఏర్ప‌డిందిట‌. భారీ కాంపిటీష‌న్‌లో… మ‌హాన‌టి శాటిలైట్‌ని జీటీవీ ఏకంగా 11కోట్లు చెల్లించి ఛేజిక్కించుకుంద‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు బేర‌సారాలు పూర్త‌య్యాయిట‌.

వాస్త‌వానికి `మ‌హాన‌టి` రిలీజ్ ముందు స‌న్నివేశం వేరు. రిలీజ్ త‌ర‌వాత ఈ సినిమా ఊహించ‌ని రీతిలో క‌లెక్ష‌న్లు సాధిస్తూ అంద‌రికీ షాక్‌నిచ్చింది. రిలీజ్ ముందు సినిమా చూసిన ఓ నైజాం పంపిణీదారుడు సినిమాని కొనేందుకు నిరాక‌రించాడ‌ట‌. ఇప్పుడు ఊహించ‌ని ఈ విజ‌యం చూసి తాను ఈ సినిమాని మిస్స‌యినందుకు రిగ్రెట్ ఫీల‌వుతున్నాడ‌ని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments