వామ్మో… సావిత్రి పిల్లలకోసం ఇంటికి పులిని తెచ్చిందట

Sunday, April 29th, 2018, 11:32:20 AM IST

అలనాటి మహానటి సావిత్రి జీవితం ఆధారంగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘మహానటి’. ఈ సినిమాలో కీర్తీ సురేశ్‌ సావిత్రి పాత్రను పోషించారు. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్‌ బ్యానర్స్‌పై ప్రియాంకా దత్త్‌ నిర్మించిన ఈ సినిమా మే 11న తెరపైకి రాబోతుంది. దుల్కర్‌ సల్మాన్, సమంత, విజయ్‌ దేవరకొండ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ ‘మహానటి’లో సావిత్రి గురించి మనందరికీ తెలియని సావిత్రి ఇష్టాయిష్టాలు, చమత్కారవంతమైన తన అలవాట్లు ఈ చిత్రంలో చూపించనున్నారు. అందులో కొన్ని మీ కోసం…

సావిత్రి కార్లను ఎక్కువగా ఇష్టపడేవారు. ఆ ఆకాలంలో ఆమె రేస్‌ కార్‌ డ్రైవర్‌ కూడా. ఒకానొక సమయంలో చెన్నైలో ఎక్కువ రేస్‌ కార్ల కలెక్షన్‌ ఉందంటే అది సావిత్రి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కీర్తీ సురేశ్‌ కారు పక్కన నిలబడి ఇచ్చిన పోజు సినిమాలోనిదే.

ఓసారి ఏం జరిగిందంటే సావిత్రి మైసూర్‌ వెళ్లినప్పుడు మైసూర్‌ మహారాజ్‌ ప్యాలెస్‌లో టైగర్స్‌ ఉండటం గమనించిందట, పిల్లలు ఆడుకోవటానికి బాగుంటుందని ప్యాలెస్ సిబ్బందిని అడిగి ఒకదాన్ని ఇంటికి తీసుకువెళ్లారట. ఇంట్లో సడన్‌గా పులిని చూసిన ఆమె భర్త‘జెమినీ’గణేశన్‌ పులిని చూసి చాలా భయపడ్డారట.

సినిమాలు, కార్లే కాదు సావిత్రి విపరీతమైన స్పోర్ట్స్‌ అభిమాని కూడా. షూటింగ్ నుంచి వచ్చాక కాస్త విశ్రాంతి దొరికినప్పుడు బ్యాడ్‌మింటన్, షటిల్‌ ఎక్కువగా ఆడేవారు.

స్విమ్మింగ్‌ మీద అమితమైన ఇష్టంతో ఇంట్లోనే ఓ పెద్ద స్మిమ్మింగ్‌ పూల్‌ని కట్టించుకున్నారు. ఇంట్లో ఉన్న ప్రతీ రోజు కచ్చితంగా స్విమ్మింగ్ చేసేవారు.

సావిత్రికి గోల్డ్‌ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో ఏకంగా ఒక కంసాలిని ఇంట్లో పెట్టుకున్నారట. తనకు నచ్చిన డిజైన్‌తో జ్యూయలరీ తయారు చేయించుకునేవారట. అలాంటి నగలనే సినిమాలో కీర్తీ వాడారు.
ఇంకా మహానటి సినిమాకి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడం కోసం వేచి చూద్దాం.

  •  
  •  
  •  
  •  

Comments