మహానటి హవా .. తగ్గినట్టుందిగా ?

Tuesday, May 22nd, 2018, 10:02:03 AM IST

మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఈ సినిమా విడుదలై రికార్డు స్థాయిలో వసూళ్లు అందుకోవడం .. సినిమా పై ఆందరూ ప్రశంశలు కురిపించడమతొ మహానటి ఎదురు లేకుండా పోయింది. అటు ఓవర్ సీస్ లోకూడా మహానటి సత్తా చాటింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో అద్భుతంగా నటించిందని మంచి మార్కులే కొట్టేసింది కీర్తి సురేష్. మొదటి వారంలో జోరు ప్రదర్శించిన మహానటి రెండో వారంలో ఆ జోరుకు బ్రేకులు పడ్డట్టున్నాయి. సినిమాను అందరు అభినందిస్తున్నా కూడా కొన్ని మైనస్ లు ఉన్నాయని, చాలా సన్నివేశాలను చూపించే ప్రయత్నాలు చేయలేదని విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఆ విషయాలు పక్కన పెడితే మహానటి సినిమా ఓవర్ సీస్ లో దూసుకుపోతోందని టాప్ వన్ లో నిలుస్తుందని అన్నారు .. కానీ రెండో వారంలో మొత్తంగా 2. 3 మిలియన్ డాలర్స్ మాత్రమే వసూలు చేసింది. టాప్ లిస్ట్ లో ఉన్న ఫిదా, అ ఆ, లాంటి సినిమాలనే దాటలేకపోయింది. ఈ లెక్కన మహానటి కేవలం ఐదో ప్లేస్ తోనే సరిపెట్టుకునేల ఉంది. ఇప్పటికి రంగస్థలం సినిమా మొదటి స్థానంలో దూసుకుపోతుంది.

  •  
  •  
  •  
  •  

Comments