మ‌హాన‌టి త‌మిళ రిలీజ్ ఎందుకు డిలే?

Saturday, May 5th, 2018, 09:40:50 PM IST


కీర్తి సురేష్ టైటిల్‌ పాత్ర‌లో తెర‌కెక్కిన `మ‌హాన‌టి`కి సెన్సార్ క్లీన్ `యు` స‌ర్టిఫికెట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలు స‌హా, విదేశాల్లో తెలుగు వెర్ష‌న్ అత్య ంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ కానుంది. టాలీవుడ్ రిలీజ్ స‌రే.. కోలీవుడ్ రిలీజ్ ఏ స్థాయిలో ఉండ‌బోతోంది? అన్న ప్ర‌శ్న‌కు ఇంత‌వ‌ర‌కూ స‌మాధానం లేదు. ఈ సినిమా తెలుగు రిలీజ్ స‌హా త‌మిళ రిలీజ్‌పై జ‌నాల్లో ఆస‌క్తి నెల‌కొంది. అందుకు త‌గ్గ‌ట్టే త‌మిళంలోనూ భారీ రిలీజ్ చేసేందుకు వైజ‌యంతి మూవీస్ ప్లాన్ చేస్తోంది. అయితే తెలుగు వెర్ష‌న్ రిలీజ్ రోజు ఈ రిలీజ్ ఉండ‌ద‌ని తెలుస్తోంది. `మ‌హాన‌టి` త‌మిళ‌నాడు రిలీజ్ ఆల‌స్య‌మ‌వుతోంద‌ని స‌మాచారం.

లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం మే 9న తెలుగులో, మే 11న త‌మిళంలో రిలీజ్ చేస్తార‌ని తెలుస్తోంది. న‌డిగ‌ర తిల‌గంలో కొన్ని అడ్డంకుల వ‌ల్ల ఈ స‌మ‌స్య త‌లెత్తింద‌ని తెలుస్తోంది. అయితే త‌మిళ‌నాడు రిలీజ్ అశ్వ‌నిద‌త్ టీమ్‌కి ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కం. అక్క‌డ‌ జెమిని గ‌ణేష‌న్, సావిత్రి అభిమానులు ఈ సినిమాని వీక్షించేందుకు ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్నారు కాబ‌ట్టి ఎంతో జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో, త‌మిళ‌నాడులో ఏ స్థాయిలో ప్ర‌భావం చూపిస్తుంది? బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది? అని అంతా ఒక‌టే ఉత్క ంఠ‌ను క‌న‌బ‌రుస్తున్నారు.