“మహానటి “ ఒక మరుపు రాని అద్భుత చిత్రం

Friday, May 25th, 2018, 07:04:05 PM IST

మహానటి సావిత్రి గారంటే అసలు తెలియని వారు ఉండరు . అయితే తాజాగా మహానటి సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకొని తీసిన చిత్రం “మహానటి ” ఈ చిత్రం మే 9 న విడుదలయి ఇప్పటికీ మంచి కలెక్షన్లు రాబడుతూ ప్రేక్షకులని అలరిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ సభ్యులు విజయోత్సవ సభ ను హైదరాబాద్ లో నిర్వహించారు . ఈ సభకి సావిత్రి గారి పాత్రను పోషించిన కీర్తి సురేష్ , విజయ్ దేవరకొండ , రచయిత సాయి మాధవ్ బుర్రా, దర్శకుడు నాగ అశ్విన్ , నిర్మాతలు స్వప్న దత్ , ప్రియాంక దత్ , తదితరులు హాజరు అయ్యారు ….

ముందుగా హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ సావిత్రి గారు ఒక గొప్ప మహానటి అంటువంటి సావిత్రి గారి పాత్ర పోషించడం చాలా అదృష్టం గాను మరియు అది నా లైఫ్ టైం అఛీవ్మెంట్ గా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రo నా జీవితంలో, ఎప్పటికి మరిచిపోలేని ఒక అద్భుత చిత్రంగా నిలుస్తుందని తెలిపారు. ఇంతటి గొప్ప చిత్రంలో నటించేందుకు అవకాశం కల్పించినందుకు గాను దర్శక నిర్మాతలకి, నాకు షూటింగ్ సమయంలో అన్నివిధాలా సహకరించిన చిత్ర యూనిట్ సభ్యలందరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాని తెలిపారు…..

  •  
  •  
  •  
  •  

Comments