సామి స్క్వేర్‌ : చియాన్‌తో మ‌హాన‌టి?

Wednesday, April 18th, 2018, 01:05:46 PM IST

చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా `సింగం` హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో `సామి-స్క్వేర్‌` తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమాని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తమిళ్‌-తెలుగు ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కిస్తున్నారు. విక్ర‌మ్‌-హ‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ `సామి`కి సీక్వెల్ కావ‌డంతో అంద‌రిలోనూ భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. విక్ర‌మ్ మునుపెన్న‌డూ క‌నిపించ‌నంత కొత్త‌గా ఈ సినిమాలో క‌నిపిస్తాడ‌ని హ‌రి చెబుతున్నారు. ఇదివ‌ర‌కూ రిలీజైన విక్ర‌మ్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ చూస్తే చియాన్ బాండ్ 007ని త‌ల‌పించాడు.

ఈ సినిమాకోసం దేశ రాజ‌ధాని దిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో ప్ర‌భు – ఐశ్వ‌ర్య మ‌రో జంట‌గా న‌టిస్తున్నారు. క్యూట్ త్రిష ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తోంది. తాజాగా విక్ర‌మ్ – కీర్తి జంట కొత్త పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో చియాన్‌తో మ‌హాన‌టి ఆరంగేట్రం ఇలా ఉంటుందేమో అన్నంత ఇంప్రెస్సివ్‌గా క‌నిపిస్తోంది కీర్తి. విక్ర‌మ్ స్టైలిష్‌గా జేమ్స్‌బాండ్‌లా సూటూ-బూటుతో క‌నిపిస్తుంటే, ఆ వెన‌క ప‌సుపు వ‌ర్ణం డిజైన‌ర్ వేర్‌లో కీర్తి ఎంతో ట్రెడిష‌న‌ల్‌గా క‌నిపిస్తోంది. ఆన్‌స్క్రీన్ ఈ ఇద్ద‌రి మ‌ధ్యా కెమిస్ట్రీపైనా భారీ అంచ‌నాలు పెంచుతోంది ఈ పోస్ట‌ర్.

  •  
  •  
  •  
  •  

Comments