కీర్తి సురేష్ నిజంగా సావిత్రి గారే..

Tuesday, October 17th, 2017, 06:39:38 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో అందరు ఎదురు చూస్తున్న స్పెషల్ చిత్రం ఏదైనా ఉందంటే అది ఒక్క సావిత్రి బయోపిక్ అని చెప్పాలి. ‘మహానటి’ అనే టైటిల్ తో తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం చాలా సైలెంట్ గా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఎవడే సుబ్రమణ్యం చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు నాగ్ అశ్విన్ మహానటి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేష్ ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు కీర్తి సురేష్ పుట్టినరోజు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సావిత్రి చిత్రంలోని ఒక లుక్ ని రిలీజ్ చేసింది. అందులో కేవలం కీర్తి కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. చూస్తుంటే సావిత్రి లుక్ లో కీర్తి ప్రాణం పెట్టి నటిస్తోందా అని అంటున్నారు నెటిజన్స్. ఎందుకంటే కీర్తి అచ్చం ఆ మహానటి లా కనిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో సమంత – దుల్కర్ సల్మాన్ లతో పటు కీర్తి సురేష్ వంటి తారలు కూడా నటిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments