మహానుభావుడా… లక్కు తోక తోక్కుతావా?

Thursday, September 28th, 2017, 06:10:02 PM IST

తెలుగు రెండు పెద్ద స్టార్ హీరోల సినిమాలు జై లవకుశ, స్పైడర్ ప్రేక్షకుల ముందుకి వచ్చేసాయి. భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇప్పటికే జై లవకుశ సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు దాటిపోయి సెకండ్ వీకెండ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ అద్బుతంగా ఉందనే అభిప్రాయం వచ్చిన, అతని మేనియా సినిమాని అనుకున్న స్థాయిలో నిలబెట్టలేకపోయింది. ఇక 27న రిలీజ్ అయిన స్పైడర్ సినిమా మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి కాస్తా కనెక్ట్ అయిన, బీ,సి సెంటర్స్ ఆడియన్స్ కి అనుకున్న స్థాయిలో రీచ్ కాలేదు. మహేశ్ బాబుని భారీ రేంజ్ లో ఊహించుకుంటే చాలా నార్మల్ పాత్రలో ప్రాజెక్ట్ చేయడం ఆయన ఫ్యాన్స్ కి గాని, మిగిలిన తెలుగు ప్రేక్షకులకి గాని అంతగా కనెక్ట్ కాలేదు. ఇక సినిమా కంటెంట్ బాగున్న అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాలేకపోతుంది. ప్రస్తుతానికి మిక్స్ టాక్ తో రన్ అవుతుంది.

అయితే ఈ రెండు సినిమాలకి పోటీగా శర్వానంద్ మహానుభావుడు సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వస్తుంది. మారుతి దర్శకత్వంలో వస్తున్నా ఈ సినిమా ట్రైలర్ తో పాటు. పాటలతో ఆకట్టుకుంది. దీంతో సినిమా మీద పోజిటివ్ టాక్ ఉంది. మంచి ఆహ్లాదకరమైన కామెడీ ఎంటర్టైనర్ గా సినిమ ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల మీద ఒన్న నెగిటివ్ టాక్ మహానుభావుడుకి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో శర్వానంద్ సినిమాలు స్టార్ హీరోలతో పోటీగా వచ్చి సక్సెస్ అందుకున్నవే, వాటిలో రన్ రాజా రన్ ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి సినిమాలు శర్వానంద్ కెరియర్లో హ్యాట్రిక్ విజయాలు అందించాయి. ఇప్పుడు కూడా స్టార్ హీరోలతో పోటీగా వచ్చిన మహానుభావుడు సినిమా శర్వానంద్ కి ప్లస్ అవుతుందని అందరు అనుకుంటున్నారు. సినిమా ఎ మాత్రం బాగున్న రెండు పెద్ద సినిమాల కలెక్షన్స్ ని మహానుభావుడు తీసుకుపోవడం గ్యారెంటీ అని టాక్ వినిపిస్తుంది. మరి శర్వానంద్ ఈ సారి కూడా లక్ తోక తొక్కుతాడేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments