జూలై 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం!

Monday, June 29th, 2020, 05:45:12 PM IST

భారత దేశం లో ఎక్కువగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న రాష్ట్రం గా మహారాష్ట్ర నిలిచింది. దేశం లో అత్యధిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతూ ఉండటం తో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడానికి జూలై 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అత్యధిక కేసులు నమోదు అవుతుండటం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ లాక్ డౌన్ అంశం పై ఉత్తర్వులను విడుదల చేసి, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 5 లక్షలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 1,64,626 పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రానికి చెందినవే. ఇప్పటి వరకు కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 86,575 కి చేరింది. అలానే కరోనా వైరస్ భారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య 70,622. అయితే ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 7,429 మంది మరణించారు.

అయితే దేశంలో అన్ లాక్ డౌన్ తర్వాత కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందింది. ఎక్కడికక్కడ విపరీతంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడం తో మరొక సారి రాష్ట్ర ప్రభుత్వాలు పలు చోట్ల లాక్ డౌన్ ను అమలు చేయాలని భావిస్తున్నాయి.