ఇన్ని రోజులు అవుతున్నా ఎక్కడా తగ్గనంటున్న “మహర్షి”

Saturday, June 8th, 2019, 11:58:17 PM IST

“భరత్ అనే నేను” లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న తర్వాత మహేష్ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా మళ్ళీ హిట్ ట్రాక్ లో పడతారా అన్న అనుమానాలు మహేష్ అభిమానుల్లో చాలానే ఏర్పడ్డాయి.వంశీ పైడిపల్లి తో మొట్టమొదటి సారి సినిమా తీస్తుండడంతో సినిమా ఫలితం ఎలా ఉండబోతుందా అని అంతా అనుకున్నారు.కానీ ఈ చిత్రం మాత్రం అస్సలు ఎవ్వరు ఊహించని విజయాన్ని అందుకుంది.

కొన్ని కొన్ని ఏరియాల్లో మినహాయిస్తే ఈ చిత్రం విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా సరే చాలా స్ట్రాంగ్ వసూళ్ళను రాబడతూ ఆశ్చర్య పరుస్తుంది.ఇదొక్కటి మాత్రమే కాకుండా చాలా చోట్ల ఇప్పటికీ ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ కూడా పడుతున్నాయట.అలాగే తాజాగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కంటిన్యూగా లక్ష రూపాయలు కలెక్ట్ చేసిన మూడో చిత్రంగా కూడా నిలిచింది. విడుదలైన 31 రోజులు వరకు అక్కడ వరుసగా ప్రతీ రోజు లక్ష రూపాయలు కొల్లగొట్టిందట.దీనితో ఇప్పుడు మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.