ఆ వార్తల్లో నిజం లేదంటున్న మహర్షి టీం ?

Sunday, September 30th, 2018, 09:53:04 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం మహర్షి. ఈ సినిమా విషయంలో మహేష్ సంతృప్తిగా లేకపోవడంతో కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నారంటూ జరుగుతున్నా ప్రచారం పై టీమ్ స్పందించింది. ఈ సినిమా విషయంలో జారుతున్న ప్రచారం అంతా అబద్దమని .. ఈ సినిమాకు ఎలాంటి రీ షూట్స్ చేయడం లేదని టీమ్ తెలిపింది. ఇప్పటికే డెహ్రూడూన్ లో మొదటి షెడ్యూల్, ఆ తరువాత హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ పూర్తీ చేసుకున్న ఈ టీమ్ తదుపరి షెడ్యూల్ కోసం అమెరికా వెళ్ళింది. అయితే ఇదివరకే అమెరికా షెడ్యూల్ వాయిదా పడ్డట్టు వస్తున్నా వార్తలు కూడా తప్పని తెలిపింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ అక్టోబర్ రెండో వారం నుండి అమెరికాలో నెక్స్ట్ షెడ్యూల్ చేస్తామని తెలిపారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ కీ రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్టే ఏప్రిల్ 5న విడుదల చేస్తామని టీమ్ స్పష్టం చేసింది.