32భాష‌ల్లో 300కోట్ల బ‌డ్జెట్‌తో `మ‌హావీర్ క‌ర్ణ‌`

Wednesday, April 11th, 2018, 10:46:59 PM IST

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఎన్న‌డూ లేని అసాధార‌ణ ప్ర‌క్రియ మొద‌లైంది. బాహుబ‌లి నేర్పిన పాఠం ఒంట‌బ‌ట్టించుకున్న మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, ర‌చ‌యిత‌లు అస‌లు ఎలాంటి సినిమాలు తెర‌కెక్కిస్తే యూనివ‌ర్శ‌ల్ అన్న ఆలోచ‌న‌ల్లో న‌లిగిపోతున్నారు. లోక‌ల్ కంటెంట్‌కి పాత‌రేసి, యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న హిస్టారిక‌ల్‌, ఫిక్ష‌న‌ల్‌, మైథ‌లాజిక‌ల్ క‌థాంశాల‌పై దృష్టి సారించారు. ఆ కోవ‌లోనే మ‌హాభార‌తం, రామాయ‌ణం, ఓడియ‌న్‌, సంఘ‌మిత్ర‌.. వంటి భారీ చిత్రాల రూప‌క‌ల్ప‌న‌కు తెర‌లేచింది. భవిష్య‌త్‌ని న‌డిపించేది ఈ త‌ర‌హా అసాధార‌ణ క‌థ‌లు మాత్ర‌మేన‌ని ప్రూవ్ అవుతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌కి ధీటైన సినిమాల్ని ఇప్పుడు సౌత్ ఇండ‌స్ట్రీస్‌లోనూ తెర‌కెక్కిస్తుండ‌డం హాట్ టాపిక్ అయ్యింది.

ఈ వ‌రుస‌లో మ‌రో ప్ర‌య‌త్న‌మే `మ‌హావీర్ క‌ర్ణ‌`. మ‌హాభార‌తంలో అత్యంత ప‌రాక్ర‌ముడు, వీరాధివీరుడు, కుంతీపుత్రుడు అయిన ది గ్రేట్ క‌ర్ణుడి వీర‌త్వంపై భారీ చిత్రం తెర‌కెక్కించేందుకు రంగం సిద్ధ‌మైంది. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాని 32 భాష‌ల్లో తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. క‌ర్ణుడిగా చియాన్ విక్ర‌మ్ న‌టించ‌నున్నారు. ద‌ర్శ‌కుడు ఆర్‌.ఎస్‌.విమ‌ల్ నేడు శ‌బ‌రిమ‌లేశ్వ‌రుని ద‌ర్శించుకుని స్క్రిప్టు పూజ‌లు చేశారు. అక్టోబ‌ర్‌లో ప్రారంభించ‌నున్న ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్స్ నిర్మాణం చేప‌ట్ట‌నున్నార‌ని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments