సిస్ట‌ర్స్‌ కోసం మ‌హేష్ సందేశం

Friday, August 10th, 2018, 10:33:10 AM IST

మంచి కోసం మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు మ‌న స్టార్లు. మంచి మాట చెబితే పోయేదేముంది! మ‌హా అయితే `మాట‌`కు ఖ‌ర్చ‌య్యే ఎన‌ర్జీ త‌ప్ప‌! అని భావిస్తున్నారు. సంపాద‌న‌కు కొద‌వేం లేదు. సంఘం బావుంటే మేం కూడా బావుంటామ‌ని భావిస్తున్నారు. శ్రీ‌మంతుడు త‌ర్వాత గ్రామాలు బావుండాల‌ని కోరుకున్న మ‌హేష్ బాబు తాను ఆచ‌రించి, ప‌దిమందీ ఆచ‌రించేలా చేశాడు. అమ్మా నాన్న‌ల ఊరు బుర్రిపాలెంతో పాటు తెలంగాణ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని అభివృద్ధి చేసే ప్ర‌య‌త్నం చేశాడు. అందుకు మంచి పేరొచ్చింది. `శ్రీ‌మంతుడు` స్ఫూర్తితో `హెల్పింగ్ హ్యాండ్‌` అంటూ సొంత ఊరికి మేలు చేసే యువ‌జ‌న సంఘాలు త‌యార‌య్యాయి. సెల‌బ్రిటీల్ని స్ఫూర్తిగా తీసుకుని ఊరూరా ఇలాంటి మేలు జ‌రిగితే అంత‌కంటే కావాల్సింది ఏం ఉంటుంది?

అందుకే ఇటీవ‌లి కాలంలో మ‌న సెల‌బ్రిటీలు మంచికి సంబంధించి ఏదో ఒక‌టి చెప్పాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈనెల 26న ర‌క్షాబంధ‌న్ సంద‌ర్భంగా ఏదైనా మంచి మాట చెప్పాల‌ని త‌ల‌చాడో ఏమో.. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఇలా అభిమానుల ముందుకు వ‌చ్చారు. “మ‌న దేశంలో జ‌రిగే యాక్సిడెంట్స్‌లో రోజుకు 28 మంది హెల్మెట్లు పెట్టుకోక‌పోవ‌డం వ‌ల్ల చ‌నిపోతున్నారు. అంటే 28 కుటుంబాలు వాళ్లు ప్రేమించే మ‌నుషుల్ని కోల్పోతున్నారు. జ‌స్ట్ ఒక‌ చిన్న కేర్‌లెస్‌నెస్ వ‌ల్ల‌. ఇట్స్ టైమ్ ఫ‌ర్ ఏ ఛేంజ్‌. ఈ ర‌క్షాబంధ‌న్‌కి మీ అన్న‌య్య‌కు, త‌మ్ముడికి ఒక హెల్మెట్ గిఫ్ట్‌గా ఇవ్వండి. అది త‌ప్ప‌కుండా పెట్టుకోమ‌నండి. ఏ లైఫ్ సేవ్డ్ ఈజ్ ఏ ఫ్యామిలీ సేవ్డ్‌. సిస్ట‌ర్స్ ఫ‌ర్ ఛేంజ్‌“ అని వీడియో సందేశం ఇచ్చాడు.

దీనికి అభిమానుల నుంచి స్పంద‌న అంతే బావుంది. ఇది 100% క‌రెక్ట్‌. వెయ్యి రూపాల ఖ‌రీదైన‌ రాఖీ కటించుకునే కంటే అదే రూ.1000తో హెల్మెట్ కొని తమ్ముడికి ఇస్తే ఆ అక్క తమ్ముడుకి ప్రాణం గిఫ్ట్‌గా ఇచ్చినట్టు.. అంటూ ఓ అభిమాని రిప్ల‌య్ ఇచ్చారు. సూప‌ర్‌స్టార్ సందేశానికి ఒక్కో అభిమాని రియాక్ట‌వుతూ మంచి మేలైన సందేశ‌మిద‌ని కితాబిస్తున్నారు. మొత్తానికి రెండు వారాల ముందే చ‌క్క‌ని సందేశంతో మార్పు కోరిన మ‌హేష్‌ని అభినందించాలి.

  •  
  •  
  •  
  •  

Comments