మ‌హేష్, న‌రేష్ పాత్రలు లీక్‌

Friday, June 8th, 2018, 07:36:44 PM IST

మ‌హేష్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమా ఈనెల 10 నుంచి డెహ్రాడూన్‌లో మొద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ విదేశీ ప‌ర్య‌ట‌న పూర్తి చేసుకుని హైద‌రాబాద్‌లో అడుగుపెట్ట‌గానే కొత్త లుక్‌లో క‌నిపించి స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. మ‌హేష్ మునుపటితో పోలిస్తే కాస్త ర‌ఫ్‌గా త‌యార‌య్యాడు. పైగా గ‌డ్డం, మీసాలు పెంచి కొత్త రూపంతో షాకిచ్చాడు. ఈ లుక్ త‌న కెరీర్ ల్యాండ్ మార్క్ (25వ) సినిమా కోస‌మేన‌ని, మ‌హేష్ ఈ చిత్రంలో రైతు బిడ్డ‌గా న‌టించ‌నున్నాడ‌ని ప్ర‌చార‌మైంది.

అదంతా స‌రే.. అస‌లు అల్ల‌రి న‌రేష్ పాత్ర ఏంటి ఈ సినిమాలో? అంటే దానిపై ఇప్ప‌టికి కాస్తంత క్లారిటీ వ‌చ్చింది. ఈ చిత్రంలో న‌రేష్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మ‌హేష్‌, న‌రేష్ మ‌ధ్య స్నేహం శ్రీ‌కృష్ణుడు- కుచేలుడు త‌ర‌హాలో ఉంటుంద‌ని తెలుస్తోంది. అంటే .. మ‌హేష్ రిచ్‌గ‌య్‌, న‌రేష్ పూర్ గ‌య్ అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే. వంశీ పైడిప‌ల్లి ఈ సినిమా స్క్రీన్‌ప్లేని ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో త‌న‌దైన శైలిలో రాసుకున్నాడు. మ‌హేష్ ఈ చిత్రంలో ఓ పేద రైతు బిడ్డ‌గా క‌నిపిస్తాడు. అల్ల‌రి న‌రేష్ రిచ్‌గ‌య్‌గా క‌నిపించ‌బోతున్నాడుట‌. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహంలో ట్విస్టేంటి? అనేది తెర‌పైనే చూడాల‌ని అంటున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అర్జున్‌రెడ్డి ఫేం షాలిని పాండే మ‌రో కీల‌క పాత్ర పోషిస్తోంది. అశ్వ‌నిద‌త్‌- దిల్‌రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.