మ‌హేష్ మ‌ల్టీప్లెక్స్ చూస్తే ఝ‌ల‌క్ తింటారు!

Wednesday, September 19th, 2018, 12:35:36 AM IST

స్టార్లు, సూప‌ర్‌స్టార్లు, డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు .. భారీ ఆదాయం ఉన్న సినీసెల‌బ్రిటీలు ర‌క‌ర‌కాల బిజినెస్‌ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం చూస్తున్నాం. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో మ‌ల్టీప్లెక్స్ బిజినెస్‌పై దృష్టి సారించార‌ని తెలుస్తోంది. ఇందుకు అధికారికంగా ఏ విధ‌మైన ప్ర‌క‌ట‌నా లేకపోయ‌నా చ‌డీ చ‌ప్పుడు లేకుండా ప‌నులు చ‌క్క‌బెట్టేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

తొలిగా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ భారీ మ‌ల్టీప్లెక్స్ నిర్మాణం ప్రారంభించారు. దీని పేరు AMB సినిమాస్. ఈ మ‌ల్టీప్లెక్స్ చైన్ వ్యాపారాన్ని ఏషియ‌న్ సినిమా అధినేత‌ సునీల్ నారంగ్ తో క‌లిసి మ‌హేష్ ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే గచ్చిబౌలి నుండి కొత్తగూడ క్రాస్ రోడ్ కు వచ్చేదారిలో మెయిన్ రోడ్ పై ఓ భారీ భ‌వంతిలో మ‌ల్టీప్లెక్స్ నిర్మాణం సాగుతోంది. అల్ట్రా మోడ్ర‌న్ ఫెసిలిటీస్‌తో ఈ మ‌ల్టీప్లెక్స్ అద‌ర‌గొట్టేస్తుందిట‌. ఇప్ప‌టికే కొన్ని ఫోటోలు లీక‌య్యాయి. ఇక‌పోతే ఈ మ‌ల్టీప్లెక్స్‌ని 2019లో ఘ‌నంగాప ప్రారంభించ‌నున్నార‌ని తెలుస్తోంది. త‌దుప‌రి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప‌లు న‌గ‌రాల్లో మ‌ల్టీప్లెక్సుల విస్త‌ర‌ణ చేప‌డ‌తార‌ని తెలుస్తోంది. ఇక ఈ రంగంలో రామ్‌చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్ లాంటి స్టార్లు పెట్టుబ‌డులు పెట్ట‌నున్నార‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది.