డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కి మహేష్ మరో ఛాన్స్

Saturday, November 11th, 2017, 12:54:02 PM IST

బ్రహ్మోత్సవం – స్పైడర్ సినిమాతో ఊహించని విధంగా కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ భారత్ అనే నేను సినిమాతో మళ్లీ తన గత వైభవాన్ని చూపించాలని చాలా కష్టపడుతున్నాడు. ఈ మధ్య కాలంలో షూటింగ్ కి కూడా మహేష్ అస్సలు బ్రేక్ తీసుకోవడం లేదట. తనకు సంబందించిన సీన్స్ కాకపోయినప్పటికీ షూటింగ్ లో పాల్గొంటూ చిత్ర దర్శకుడు కొరటాల శివతో చర్చలు జరుపుతున్నాడు. అయితే మహేష్ కొరటాల తో అయిపోయాక వంశీ పైడిపల్లితో ఓ సినిమాకు ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.

అయితే ఆ సినిమా అయిపోయిన తర్వాత మహేష్ ఏ సినిమాను ఇంకా ఫైనల్ చేయలేదు. కనై రీసెంట్ గా సుకుమార్ చెప్పిన స్టోరీ లైన్ కి ఫిదా అయిపోయి కథను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు వీరి కలయికలో వన్ నేనొక్కడినే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. మరి ఇసరైన మరో హిట్ సినిమా తీస్తారో లేదో చూడాలి. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో రంగస్థలం 1985 సినిమాను చేస్తున్నాడు ఆ సినిమా అయిపోగానే మళ్లీ పూర్తి కథతో సుక్కు మహేష్ దగ్గరికి వెళ్లనున్నాడట. అంటే సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా రెండేళ్లు పట్టవచ్చని తెలుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments